తెలంగాణ ఆర్టీసీలో మ‌రో బస్సు డ్రైవ‌ర్ మ‌ర‌ణం షాక్ లో కేసీఆర్

172

15 రోజులుగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు స‌మ్మె చేస్తున్నారు… ఈ స‌మ‌యంలో ఉద్యోగులకు ఓ చేదు సంఘ‌ట‌న జ‌రిగింది. ఆర్టీసీలో మరో గుండె ఆగింది. ఇప్పటికే ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా మరో కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఖాజామియా ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. గత 15 రోజులుగా ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్న ఆయన.. క‌ృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని తన నివాసంలో కన్నుమూశారు. తెలంగాణ ప్రభుత్వ మొండి వైఖరి వల్లే ఆయన చనిపోయారని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాజామియా మృతి పట్ల తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

Image result for trs samme

తెలంగాణ ఆర్టీసీలో గ‌తవారం మ‌రో కార్మికుడు బలిదానం చేశాడు. హైదరాబాద్‌లో రాణిగంజ్ డిపోకి చెందిన ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుల్సుంపురాకు చెందిన సుదర్శన్ ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే, అతడిని సహచరులు ఆస్పత్రికి తరలించారు. మైత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సుదర్శన్ తుదిశ్వాస విడిచాడు. సుదర్శన్ గౌడ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుదర్శన్ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాడు. డబ్బులు కట్టకపోతే చెక్ బౌన్స్ అయిందని ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు చెప్పారు. మరోవైపు విధులకు హాజరుకాని వారంతా సెల్ఫ్ డిఫెన్స్ అయినట్టేనని, వారిని డ్యూటీలోకి తీసుకునేది లేదని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆందోళన చెందాడు. మళ్లీ తన ఉద్యోగం తనకు రాదేమోనని ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంసభ్యులు తెలిపారు. ఇప్పటికే ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మాహుతికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇలా ప‌లువురు ప్రాణత్యాగాలు చేయ‌డంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో మ‌రింత అస‌హ‌నం ప్ర‌భుత్వం పై పెరిగిపోతోంది.

ఇదిలా ఉంటే, ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి హైదరాబాద్‌లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 26వ తేదీ వరకు వివిధ రూపాల్లో తమ నిరసనలు కొనసాగుతాయని తెలిపారు. తాత్కాళిక డ్రైవర్లు,కండక్టర్లుగా చేస్తున్నవారు.. విధుల్లో నుంచి తప్పుకుని తమకు సహకరించాలని కోరారు. తమ పొట్టకొట్టవద్దని వారికి విజ్ఞప్తి చేశారు. సమ్మెను మరింత ఉధృతం చేసి ప్రభుత్వ మెడలు వంచి తీరుతామని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం అంతకంటే మొండి వైఖరితో వ్యవహరిస్తోంది. అసలు ఆర్టీసీకి సంబంధించిన ఏ విషయంపై నేరుగా స్పందించేందుకు సీఎం కేసీఆర్ ఎలాంటి సుముఖత చూపడం లేదు.హైకోర్టు సూచనలను సైతం ఆయన పట్టించుకోకపోవడం గమనార్హం.

ఈ క్రింద వీడియో చూడండి