రేపే తెలంగాణ కొత్త CM ప్రమాణ స్వీకారం.. ఎవరో తెలుసా?

293

శాససనభ ఎన్నికల్లో అధికార పార్టీకే తెలంగాణ జనం జైకొట్టారు. టీఆర్ఎస్ పార్టీ 90కిపైగా స్థానాల్లో విజయం దిశగా సాగుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం 119 స్థానాలకు గానూ టీఆర్ఎస్ 91 సీట్లలోనూ, ప్రజాకూటమి 19, ఎంఐఎం 6, బీజేపీ రెండు చోట్ల ఆధిక్యతలో ఉన్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే కేసీఆర్‌ను లెజిస్లేచివ్ పార్టీ నేతగా ఎన్నుకోనున్నారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బుధవారం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. బుధవారం సప్తమి మంచి ముహూర్తం కావడంతో తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Image result for ktr kcr

ఆ రోజు కాకపోతే డిసెంబరు 14 కూడా నవమి తిథి కూడా మంచి ముహూర్తమేనని పండితులు అంటున్నారు. బుధవారం తప్పితే శుక్రవారం నాడు కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేవలం సీఎం ప్రమాణ స్వీకారం చేసి, తర్వాత మంత్రివర్గంతో ప్రమాణం చేయిస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. దీనిపై కేసీఆర్ సాయంత్రం మీడియా సమావేశంలో స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధిస్తున్నారు. సిద్ధిపేటలో మంత్రి హరీష్‌రావు లక్ష ఓట్లతో గెలుపొందారు. వర్దన్నపేటలో కూడా అర్మూర్ రమేశ్ 87వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఇక తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు మాత్రం ఓట‌మి చెంద‌డం ఆపార్టీకి నిరాస‌ను క‌లిగించింది. ఇక చందూలాల్ కూడా ఒట‌మి అని చెబుతున్నారు పూర్తి ఫ‌లితం రావాల్సిఉంది..

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక తెలంగాణ ఎన్నిక‌ల్లో కేసీఆర్ కు గెలుపు ముందే ఖాయం అని స‌ర్వేలు కూడా చెప్పాయి.. అలాగే తెలంగాణ‌లో స‌ర్వేలు చెప్పిన విధంగా టీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. ఇక తెల‌గాణ‌లో మంత్రులుగా మ‌హిళ‌లు లేరు అని ప‌లు విమ‌ర్శ‌లు ఇప్ప‌టి వ‌ర‌కూ ఎదుర్కొన్నారు అయితే ఈసారి మ‌హిళ‌ల‌కు కూడా అవ‌కాశం ఇవ్వ‌నున్నారు అని తెలుస్తోంది… మంత్రులు వీరే ఉంటారా లేదా వేరే ఒక‌రు ఉంటారా అనేది కూడా ఆలోచ‌న జ‌రుగుతోంది…. మ‌రి తెలంగాణ‌లో కేసీఆర్ గెలుపు టీఆర్ ఎస్ విజ‌యకారు జోరుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి. ఇక టీఆర్ఎస్ విజ‌యం పై మీ స్పంద‌న కూడా వెల్లడించండి.