జ‌గ‌న్ కు స‌పోర్ట్ చేసిన తెలంగాణ ఎమ్మెల్యే

397

తెలంగాణ‌లో కూడా ఏపీ రాజ‌కీయాలు చ‌ర్చించుకుంటున్నారు నేత‌లు… ప్ర‌జ‌లు… ముఖ్యంగా ఏపీలో ఇప్పుడు ప్ర‌త్యేక హూదా అంశం చ‌ర్చ‌కు వ‌స్తోంది… అలాగే కాపు రిజ‌ర్వేష‌న్ల అంశం కూడా తెరపైకి వ‌చ్చింది.. ఇక్క‌డ తెలంగాణ‌లో కూడా కాపులు ఏపీలో జ‌రిగే రాజ‌కీయం బట్టి నిర్ణ‌యం తీసుకోవాలి అని అనుకుంటున్నారు.. అయితే ఇక్క‌డ రిజ‌ర్వేష‌న్ల పై ఆలోచ‌న లేక‌పోయినా ఏపీలో మాత్రం ఆలోచ‌న‌లు మ‌రింత పెరుగుతున్నాయి … అధికార ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కులు త‌మ అధినాయ‌క‌త్వం కాపు రిజ‌ర్వేష‌న్ల పై ఎటువంటి ప్ర‌క‌ట‌న చేస్తుందా అని చూస్తున్నారు.

Image result for jagan

ఇటు ఏపీలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల పై తేల్చిచెప్పారు …రిజర్వేషన్ల విషయంలో అమలుకాని హామీలు ఇవ్వలేనంటూ ఆయ‌న తెలియ‌చేశారు. దీంతో కాపులు అంద‌రూ ఇప్పుడు వైసీపీ వ‌ర్ష‌న్ విన్నారు.. ఇటు తెలుగుదేశం మాత్రం నాన్చుడు వ్య‌వ‌హారం చేస్తోంది.తాజాగా ఈ అంశం పై తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్య స్పందించారు… వైఎస్ జగన్ రాజకీయ నాయకుడిగా కంటే వాస్తవికవాదిగా మాట్లాడారని ఆయన అన్నారు.

Image result for ఆర్‌. కృష్ణయ్య

రిజర్వేషన్‌ అనేది కేంద్రం పరిధిలోని అంశమని, రిజర్వేషన్లు ఒక పరిమితి మించి ఇవ్వాలనుకుంటే, రాజ్యాంగ సవరణ అవసరవుతుందని ఆర్‌. కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. ఇటు కాపు రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తే బీసీలు కూడా త‌మ హ‌క్కుల కోసం పోరాటం చేయ‌డానికి ముందుకు వ‌చ్చేలా ఉన్నారు అనేది తెలిసిందే.