రాహుల్ కు కేటిఆర్ స్ట్రాంగ్ కౌంటర్…

357

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి తెలంగాణ పర్యటనలో భాగంగా నిర్వహించిన సభల్లో కేంద్రం లోని ఎన్ డి ఎ ప్రభుత్వాన్ని, రాష్ట్రం లోని టి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు..రాష్ట్రం లో కుటుంబ పాలన సాగుతోందని కెసిఆర్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు..ఈ రోజు సరూర్‌నగర్ స్టేడియంలో ‘విద్యార్థి-నిరుద్యోగ గర్జన సభ’ సభలో మాట్లాడిన రాహుల్.. కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్.. రాహుల్ జీ అని ఒకింత గౌరవంగా మాట్లాడుతూనే కౌంటర్ల వర్షం కురిపించారు…

రాహుల్ జీ.. మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారా?.. ఒక్కసారి మీ వేదికపై ఉన్న మీ పార్టీ నేతలను చూడండి. అక్కడ కూర్చున్న వాళ్లలో సగం మందికి పైగా జైలుకెళ్లి బెయిల్‌పై బయటకి వచ్చిన వాళ్లే!! వాళ్లలో కొంతమంది సీబీఐ కేసుల్లో ఉన్నారు. మరికొంత మంది అవినీతి కేసుల్లో ఉన్నారు. ఓహ్.. అది ‘స్కామ్‌గ్రెస్’(Scamgress) పార్టీ అని నేను మర్చిపోయాను.
ఏ ఫర్ ఆదర్శ్
బీ ఫర్ బోఫోర్స్
సీ ఫర్ కామన్‌వెల్త్.. ఇంకా నన్ను కొనసాగించమంటారా సార్?” అని ఎద్దేవా చేశారు కేటీఆర్