తెలంగాణ ఐపీఎస్ అధికారిణికి జగన్ బంధువుతో పెళ్లి

379

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో కోడలిగా తెలంగాణకు చెందిన ఐపీఎస్ అధికారిణి అడుగుపెట్టబోతున్నారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అతి త్వరలోనే ఆమె వైయస్ జగన్ కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టబోతుందంటూ వార్తలు వెలువడుతున్నాయి.తమ బంధువుల ఇంట కోడలిగా అడుగుపెట్టబోతున్న ఆ మహిళా ఐపీఎస్ అధికారికి సీఎం వైయస్ జగన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇంతకీ ఆ మహిళా ఐపీఎస్ అధికారి ఎవరు, ఆమెను వివాహం చేసుకోబోతున్న జగన్ బంధువు ఎవరా అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

Image result for ఎస్పీ చందన దీప్తి

ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో మంచి ఐపీఎస్ అధికారిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు మెదక్ ఎస్పీ చందన దీప్తి. అందంతోనే కాదు పనితనంలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ అందరి మన్నలను అందుకుంటున్నారు. అయితే ఆ ఐపీఎస్ అధికారి చందన దీప్తి ఇంట పెళ్లి భాజాలుమోగబోతున్నాయంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. త్వరలోనే ఆమె వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమీప బంధువుతో ఎస్పీ చందన దీప్తికి పెళ్లి కుదిరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటి కానున్నట్లు సమాచారం. ఇకపోతే వరుడు విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసిస్తున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో ఆయన స్వదేశానికి రానున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కనస్ట్రక్షన్ మరియు హాస్పటాలిటీ వ్యాపార రంగంలో స్థిరపడనున్నట్లు తెలుస్తోంది.

Image result for చందన దీప్తి

చందన దీప్తి గురించి తెలుసుకుంటే ఆమె ఐపీఎస్. చూడగానే నిండైన తెలుగుదనం… చందమామ లాంటి మోము.. బాణాల్లాంటి చూపులతో ప్రశాంతతకు చిరునామాగా కనిపిస్తారు దీప్తి..2012 ఏపీ క్యాడర్‌కు చెందిన ఈ అచ్చ తెలుగమ్మాయి తన మార్క్ సంస్కరణలు, ప్రయోగాలతో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వరంగల్ యాసిడ్ దాడి ఘటన తో ఐపీఎస్ అవ్వాలని నిర్ణయించుకుని పట్టుదలతో ఐపీఎస్ అధికారిణి అయ్యింది.

ఈ క్రింద వీడియో చూడండి

మహిళలపై దాడులు తగ్గాలంటే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తీసుకునే చర్యలతో పాటు పురుషుల్లోనూ పరివర్తన రావాలని దీప్తి భావన. అందుకు తగ్గట్టుగానే ఐపీఎస్ అధికారిణిగా తన పరిధిలో మహిళలకు న్యాయం జరిగేలా చూస్తున్నారు.. వారి భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ‘‘షీ భరోసా’’ లాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు… ఈవ్ టీజింగ్‌ను అరికట్టేందుకు పోలీస్ స్టేషన్ల వారీగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.అలాగే పోలీస్ శాఖలో పనిచేసే మహిళా కానిస్టేబుళ్లను అధికారులు ఇతర సిబ్బంది గౌరవించేలా చూస్తున్నారు. ఒక అమ్మాయి బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ చందనకు అప్పగించారు.. ఆమె బాధ్యతను తనే తీసుకున్న దీప్తి ఉన్నత చదువులు చదివిస్తోంది. జిల్లా పోలీసులకు బాస్ అయినప్పటికీ… మెదక్ గల్లీల్లో సైకిల్ వేసుకుని తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆమె తండ్రి మైనింగ్ శాఖలో అధికారి.. అందువల్ల తరచుగా వరంగల్, కాకినాడ, నల్గొండ, చిత్తూరు ఇలా అనేక ప్రాంతాలకు బదిలీలు అవుతూ ఉండేవి. చిత్తూరు జిల్లాలో దీప్తి బాల్యం ఎక్కువగా గడిచింది. అక్కడి గుడ్ షెపర్డ్ హైస్కూల్‌ విద్యతో పాటు ఇంటర్మీడియట్ చదివారు.