తెలంగాణలో మరో మూడు కొత్త పధకాలు…ఎన్నికల కోసమేనా…

433

తెలంగాణ లో ఇప్పటికే ఎన్నో పధకాలు ప్రవేశపెట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు ముఖ్యమంత్రి కేసిఆర్…కొన్ని రోజుల కిందట ప్రవేశ పెట్టిన రైతుబందు పధకం దేశవ్యాప్తంగా సంచలనం అయింది..తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రజల కోసం మరో మూడు కొత్త పధకాలను ప్రవేశపెడుతున్నారు…పేదప్రజలందరికి కంటిచూపు సమస్యలు లేకుండా చూసే కంటి వెలుగు, రైతుకు దన్నుగా ఉండే బీమా, స్వయం ఉపాధి పొందాలని భావించే బీసీలకు అండగా ఆర్థికసహాయం అందించే కార్యక్రమాలను ఆగస్టు 15 నుండి తెలంగాణ సర్కారు చేపడుతున్నది.

ఆ రోజునే అందరికీ సురక్షితమైన తాగునీటిని అందించే మిషన్ భగీరథ పథకంలో భాగంగా నదీజలాలను బల్క్‌గా గ్రామాలకు అందించనున్నారు. రైతుకు దన్నుగా ఉండే బీమా పథకం కింద రాష్ట్రంలో 28 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగనున్నది. రైతు ఏ కారణంవల్ల మరణించినా పది రోజుల్లో, పెద్ద కర్మ పూర్తయ్యేలోగా ఐదు లక్షల రూపాయల చెక్కు అందించే విధంగా ఈ పథకానికి రూపకల్పన చేశారు.