హరికృష్ణ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

428
నందమూరి హరికృష్ణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంతేకాకుండా జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో హరికృష్ణ స్మారక చిహ్నం ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా స్థలాన్నికేటాయించింది. అంత్యక్రియలు ముగిశాక కుటుంబసభ్యుల నిర్ణయం మేరకు స్మారక చిహ్నం నిర్మించే అవకాశం ఉంది.
Image result for hari krishna nandamuri
మహా ప్రస్థానంలో‌ నందమూరి హరికృష్ణ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే ఆయన అంత్యక్రియలను మొయినాబాద్‌లో ఫాం హౌస్‌లో నిర్వహించాలని కుటుంబసభ్యులు అనుకున్నారు. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరాం అంత్యక్రియలు కూడా ఇక్కడే నిర్వహించారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని చెప్పడంతో వేదికను మార్చారు. మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన కుటుంబసభ్యులు ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరించారు.
Image result for hari krishna nandamuri kcr
రెండు గంటల ప్రాంతలో స్వగృహం నుంచి హరికృష్ణ పార్థివ దేహాన్ని బయటకు తీసుకువచ్చారు. భౌతికకాయాన్ని సీఎం చంద్రబాబు, మాజీ సుప్రీకోర్టు న్యాయమూర్తి వైకుంఠ వాహనం వరకు మోశారు. మెహిదీపట్నం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. మెహిదీపట్నం, రేతీబౌలి, టోలిచౌకి, షేక్‌పేట్‌ నాలా విస్పర్‌ వ్యాలీ మీదుగా మహాప్రస్థానం చేరుకుంటుంది. హరికృష్ణను కడసారి చూసేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు భారీగా అభిమానులు తరలివచ్చారు.  తొక్కిసలాట జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి

మరోవైపు హరికృష్ణ అంతిమయాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. సరోజినీదేవి కంటి ఆస్పత్రి, మెహిదీపట్నం, రేతీబౌలి, టోలిచౌకి, షేక్‌పేట్‌ నాలా, విస్పర్‌ వ్యాలీ మీదుగా మహాప్రస్థానం వద్దకు అంతిమయాత్ర కొనసాగుందని తెలిపారు. వాహనదారులు జజార్‌ఘాట్‌, ఆసిఫ్‌నగర్‌ మీదుగా వెళ్లాలని సూచనలు చేశారు. గచ్చిబౌలి నుంచి వచ్చే వాహనాలను ఫిల్మ్‌నగర్‌ మీదుగా మళ్లించారు.