తెలంగాణా ఎన్నికల ఫలితాలు జ‌గ‌న్ చేతిలోకి.. షాక్ లో జగన్ మోహన్ రెడ్డి

449

తెలంగాణ‌లో ఏ రాజ‌కీయ పార్టీ అధికారంలోకి వ‌స్తుంది.. ఏ రాజ‌కీయ పార్టీ ప‌గ్గాలు తీసుకుంటుంది అనే అంశం పై తెగ చ‌ర్చ జ‌రుగుతోంది. తెలంగాణ‌లో ముఖ్యంగా తెలుగుదేశం కాంగ్రెస్ జ‌న‌స‌మితి సీపీఐ ఇలా కూట‌మిగా ఏర్ప‌డి అధికార ప‌క్షం పై ఎన్నికల్లో పోటీ చేశాయి. ఇక పోలింగ్ కూడా ప్ర‌శాంతంగా ముగిసింది.. ఎంతో ఉత్కంఠ‌గా ఫ‌లితాల కోసం ఎదురుచూస్తున్నారు ప్ర‌జ‌లు నాయ‌కులు. అయితే పోలింగ్ కు వారం ముందు నుంచి తెలంగాణ‌లో ల‌గ‌డపాటి స‌ర్వే వైర‌ల్ అయింది. ఇటు కొంద‌రు నేతలు ఓడిపోతారు స్వ‌తంత్రులు గెలుస్తారు అంటూ ల‌గ‌డ‌పాటి త‌న స‌ర్వే అంటూ తెలియ‌చేశారు. దీనికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కూడా ప్ర‌చారం చేసింది .అయితే ఇక్క‌డ వ‌ర‌కూ బాగానే ఉన్నా, ల‌గ‌డ‌పాటి కావాల‌నే ఇలాంటి ప్ర‌చారం చేస్తున్నారు, ఈ స‌ర్వే కరెక్ట్ కాదు అంటూ కేటీఆర్ కూడా విమ‌ర్శించారు.

Image result for rahul and chandrababu

ఇలా కేటీఆర్ ల‌గ‌డపాటికి మ‌ధ్య వార్ ముదిరిపోయింది. ట్విట్ట‌ర్ లో కూడా ఈ వార్ పెద్ద ఎత్తున జ‌రిగింది. అయితే ఎన్నికల పోలింగ్ ముగిసిన రోజు మాత్రం క‌చ్చితంగా ల‌గ‌డ‌పాటి కాంగ్రెస్ కూట‌మికి 65 నుంచి 75 స్ధానాలు వ‌స్తాయి అని మ‌రోసారి జోస్యం చెప్పారు.. ఇక ఏపీలో కూడా తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎఫెక్ట్ చూపించ‌నున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం గెలిస్తే కూట‌మిలో చంద్ర‌బాబు పాత్ర ఎక్కువ ఉంటుంది. క‌చ్చితంగా తెలంగాణ‌లో చంద్ర‌బాబుకు మ‌ళ్లీ త‌న స‌త్తా చాటుతారు. ఇది ఇరు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం బ‌ల‌ప‌డ‌టానికి ఓ కార‌ణం అవుతుంది.

Image result for kcr

ఇలా రాజ‌కీయంగా తెలంగాణ‌లో పార్టీ బ‌ల‌ప‌డినా ఇక్క‌డ వైసీపీ ఏపీలో త‌న బ‌లం పొగొట్టుకున్న‌ట్లే, ఎందుకు అంటే చంద్ర‌బాబు తెలంగాణ‌లో చ‌క్రం తిప్పితే ఏపీలో జ‌గ‌న్ పార్టీ డైల‌మాలో ప‌డుతుంది. ప్ర‌జ‌లు కూడా టీడీపీని న‌మ్ముతారు. అలాగే ల‌గ‌డ‌పాటి స‌ర్వేల ఎఫెక్ట్ ఏపీలో టీడీపీకి విజయావకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి అనే తెలియ‌చేస్తుంది. ఇక జ‌గ‌న్ కూడా ఇదే ఆలోచిస్తున్నారు. ఇప్ప‌టికే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెనుక ఉన్న‌నేత‌లు అంద‌రూ కూడా కేసీఆర్ కు టీఆర్ఎస్ పార్టికి సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఒక్క‌సారిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌లో అధికారంలో కి వ‌స్తే జ‌గ‌న్ కు కూడా ఇబ్బంది ఉంటుంది అని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

గ‌త నాలుగు రోజుల నుంచి తెలంగాణ‌లో స‌ర్వే రిపోర్టులు, ల‌గ‌డ‌పాటి రిపోర్టు ఇంట‌ర్న‌ల్ పోల్ స‌ర్వేలు, ఎగ్జిట్ పోల్స్ స‌ర్వేలు జ‌గ‌న్ ముందు ఉన్నాయట. దీని ప్ర‌కారం గ్రౌండ్ లెవెల్లో ఏ పార్టీ ప‌రిస్దితి ఎలా ఉందిఅనేది, ఏ స‌ర్వే చెప్పింది క‌రెక్టుగా వ‌చ్చింది అనేది జ‌గ‌న్ చూసుకుంటున్నార‌ట‌. మ‌రి దీనిపై జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఎలా ఉంటుందో చూడాలి , ఏది ఏమైనా ఏపీలో కూడా తెలంగాణ ఫ‌లితం ఎఫెక్ట్ చూపించ‌నుంది అనేది వాస్త‌వం. మ‌రి చూశారుగా ఈ ఫ‌లితాల పై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.