టి కాంగ్రెస్ కు షాక్..బిజెపి లోకి కోమటిరెడ్డి బ్రదర్స్..?

383

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ రాజకీయ భవిష్యత్తు కోసం తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు..ప్రస్తుతం ఉన్న పార్టీలో వారికి సరైన ప్రాధాన్యత లేకపోవడంతో వారు ఇతర పార్టీలో చేరడానికి మొగ్గు చూపుతున్నారు..ఈ క్రమంలోనే నంగొండ జిలా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమటి రెడ్డి బ్రదర్స్ గా పేరు గాంచిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి గత కొంత కాలంగా అసంతృప్తి తో ఉన్నట్టు తెలుస్తోంది..ఇప్పటికే వీరు పార్టీ కార్యక్రమాల నుంచి దూరంగా ఉంటున్నారు…

పార్టీ సీనియర్ నాయకుడు శాసనసభా పక్ష నేత జానా రెడ్డి, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి తో వీరికి విభేదాలు ఉన్నట్టు అందుకే వీరు బిజెపి లోకి దూకేందుకు సిద్దంగా ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి..అందుకోసమే అతి త్వరలోనే కేంద్రమంత్రి రాజ్ నాద్ సింగ్ తో భేటీ కానున్నారని మీడియాలో వార్తలు వెలువడ్డాయి.అయితే ఈ వార్తలపై కోమటి రెడ్డి బ్రదర్స్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.. ఈ తరహాలోనే తెలంగాణ తెలుగుదేశం నుంచి బహిష్కృతుడైన మోత్కుపల్లి నరసింహులు కూడా త్వరలో జనసేన పార్టీలో చేరనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి..ఆయన కొద్ది రోజుల కిందట జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అవడం కూడా ఈ వార్తలకు ఊపునిస్తోంది…