కరుణానిధి పార్దీవ దేహానికి కేసిఆర్ నివాళి…!

379

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డిఎంకే అధ్యక్షుడు కరుణానిధి పార్దీవ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ అంజలి ఘటించారు..హైదరాబాద్ నుంచి చెన్నై చేరుకున్న ఆయన నేరుగా విమానాశ్రయం నుంచి రాజాజీ హాల్ కు చేరుకున్నారు..కరుణానిధి కుమారుడు స్టాలిన్ కేసిఆర్ ను కరుణ పార్దీవ దేహం వద్దకు తీసుకెళ్ళారు..కరుణానిధి భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఆయనకు కేసీఆర్ నివాళి అర్పించారు.

అనంతరం కరుణానిధి కుటుంబసభ్యులను పరామర్శించారు. కేసీఆర్ వెంట ఎంపీ కవిత కూడా ఉన్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ చెన్నై చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా కరుణానిధి భౌతికకాయం ఉంచిన రాజాజీ హాల్‌కు వెళ్లారు.