తెలంగాణాలో ముందస్తుకు రెడీ అయిన కేసిఆర్..

382

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం..ఇప్పటికే ఈ విషయమై కెసిఆర్ కేంద్రంతో  చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది..ఈ మధ్య కాలంలో తరచూ డిల్లీ వెళ్లి బిజెపి నాయకులతో చర్చలు జరపడం వెనుక వ్యూహం కూడా ఇదేనని వార్తలు వెలువడుతున్నాయి…ముందస్తు విషయంలో కేసీఆర్ బీజేపీ అధిష్టానం ముందు ఓ ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది.

ముందు మాకు అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించండి. ఆ తర్వాత వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాము మీకు సహకరిస్తాం అనే ప్రతిపాదననీ పెట్టారట. ఇందుకు బీజేపీ కూడా ఓకే చెప్పినట్టు సమాచారమ్. ఈ నేపథ్యంలో అక్టోబర్ లోనే కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే.. ఈ యేడాదియే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే రాజకీయంగా తమకు కొన్ని సమస్యలు ఉంటాయని, కాంగ్రెస్ బలపడకముందే ఎన్నికలకు వెళ్లడం ద్వారా ప్రయోజనం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.