ఉక్కుతో జ‌గ‌న్ ని ఇబ్బంది పెడుతున్న టీడీపీ

508

రాయ‌ల‌సీమ రాజ‌కీయాల్లో క‌డ‌ప రాజ‌కీయాలు వేరు.. వైయ‌స్ ఉన్నంత వ‌ర‌కూ క‌డ‌ప‌లో త‌మ‌కు ఎదురేలేదు అని భావించింది కాంగ్రెస్.. ఇక ఆ వార‌స‌త్వం జ‌గ‌న్ తీసుకున్నారు.. వైసీపీని స్ధాపించి జిల్లాలో కూడా త‌న హావా చూపించారు.. 10 ఎమ్మెల్యే స్ధానాల‌కు గాను 9 స్ధానాలు వైసీపీ గెలుచుకుంది.. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా ఇక్క‌డ నుంచి ఐదారు స్దానాలు గెల‌వాలి అని తెలుగుదేశం ఆలోచిస్తోంది.

Image result for jagan with chandrababu naidu

ఇక జిల్లా నుంచి వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో ముందుకు వెళుతోంది తెలుగుదేశం. కాని క‌డ‌ప జిల్లాలో వైసీపీకి మ‌రింత రివ‌ర్స్ వేవ్స్ త‌గులుతున్నాయి.. ఇక్క‌డ జ‌గ‌న్ కంచుకోట‌కు బీట‌లు వాలే ప‌రిస్దితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది….30 ఏళ్లుగా క‌డ‌పకు నిర్ల‌క్ష్య‌పు మ‌ర‌క‌లు ఉన్నాయ‌నే భావ‌న, అక్క‌డ ప్ర‌జ‌ల్లో క‌లిగింద‌ట.. అందుకే బాబు పాల‌న మ‌ర‌లా ఇక్క‌డ ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు అని తెలుస్తోంది.

Image result for jagan with chandrababu naidu

రాజం పేట ఎమ్మెల్యే మేడా మ‌ల్లిఖార్జున రెడ్డి మిన‌హా ఇక్క‌డ టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవ‌రూ లేరు.. అయితే వ‌చ్చేఎన్నిక‌ల్లో ఈ రికార్డును తిర‌గ‌రాసి వైసీపీ రికార్డు త‌మ ఖాతాలో వేసుకోవాలి అని చూస్తోంది టీడీపీ.. సీఎం చంద్ర‌బాబు పులివెందుల‌కు తాగునీటి స‌మ‌స్య తీర్చారు.. అలాగే ఇక్క‌డ నీటి స‌మ‌స్య లేకుండా ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది తెలుగుదేశం పార్టీ. పులివెందుల‌కు బాబు కృష్ణా జ‌లాల‌ను తీసుకురావ‌డంతో, క‌డ‌ప జిల్లా అంతా బాబుకు జేజేలు ప‌లుకుతున్నారు అని టీడీపీ కేడ‌ర్ కూడా చెబుతోంది.

Image result for jagan with chandrababu naidu

ఇక క‌డ‌ప ఉక్కు కోసం టీడీపీ మంకు ప‌ట్టు ప‌డుతోంది. ఏమి రాజ‌కీయాలు చేయ‌డానికి అయినా తెలుగుదేశం వెన‌కాడే ప్ర‌శ‌క్తి లేదు అంటోంది… ఇటు కేంద్రం సాయం చేయ‌మ‌ని కోరినా నోరు మెద‌ప‌డం లేద‌ని వాపోతున్నారు.. ఇవ‌న్నీ ప్ర‌జ‌ల్లో పాజిటివ్ వేవ్స్ టీడీపీకి తీసుకువ‌స్తున్నాయి… కేంద్రం సాయం చేయ‌క‌పోతే ఉక్కు ఫ్యాక్ట‌రీ తామే నిర్మిస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో తెలియ‌చేశారు. క‌డ‌ప జిల్లాలో సీఎం ర‌మేష్ రాజ్య‌స‌భ స‌భ్యుడిగా క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ‌కు నిరాహార దీక్ష చేయ‌డం, టీడీపీకి పాజిటివ్ మార్క్ చూపించింది.

Image result for jagan with chandrababu naidu

జిల్లాలో టీడీపీకి మ‌రింత పాజిటివ్ నేమ్ వ‌చ్చింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర‌వ్యాప్తంగా ఇలా దీక్షలు చేయ‌డంతో మ‌రింత ఫేమ్ వ‌చ్చింది. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత సొంత జిల్లా నేత, జిల్లాలో 9 స్ధానాలు గెలుచుకున్న జ‌గ‌న్ ఎందుకు ఉక్కు ప‌రిశ్ర‌మ‌పై ప్ర‌శ్నించ‌డం లేద‌ని టార్గెట్ చేస్తున్నారు తెలుగుదేశం నాయ‌కులు. ఇక జ‌గన్ ఆలోచ‌న ఎలా ఉందో తెలియ‌దు.. కాని ఇప్పుడు మాత్రం క‌డ‌ప ఉక్కు అలాగే కృష్ణా జ‌లాల‌ను పులివెందులకు తీసుకురావ‌డంలో బాబు స‌క్సెస్ అయ్యారు అని, అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్కడ క‌డ‌ప కంచుకోట ప‌రిస్దితి టీడీపీకి అనుకూలంగా మారుతుంది అని అంటున్నారు సీమ‌బిడ్డ‌లు.