హ‌స్తం పార్టీకి హ‌స్తం ఇవ్వ‌నున్న సైకిల్ ?

390

ఎవ‌రు స‌పోర్ట్ చేసినా చెయ్య‌క‌పోయినా కేంద్రం అనుకున్న‌ది నెర‌వేర్చుకుంది.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో అనుకున్న‌ది సాధించుకుంది.. ప్ర‌తిప‌క్షాల అభ్య‌ర్ద‌ని ఓడించి బీజేపీ త‌న స‌త్తా మ‌రోసారి ఈ ఎన్నిక‌ల్లో చాటింది ..ఇక పెద్ద‌ల స‌భ‌లో కూడా త‌న స‌త్తా నిరూపించుకోవ‌డంతో ప్ర‌తిప‌క్షాలు కూడా కాస్త షాక్ గు గురి అయ్యాయి.. అయితే 5 ఓట్ల తేడాఅయినా విజ‌యం విజ‌యం అనేది ఇక్క‌డ చ‌ర్చించుకోవాల్సిన అంశం.

Related image

ఇక్క‌డే ఓ కొస‌మెరుపు.. తెలుగుదేశం పార్టీ బీజేపీకి స‌పోర్ట్ చేయ‌లేదు.. ఎన్డీయే అభ్య‌ర్దికి ఓటు వెయ్య‌లేదు.. ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ నిల‌బెట్టిన బ‌ల‌ప‌రించిన అభ్య‌ర్ది క‌దా అని తెలుగుదేశం వారికి స‌పోర్ట్ చేసింది… ఇక్క‌డ తెలుగుదేశం కాంగ్రెస్ తో పొత్తుకు ఉవ్విళ్లూరుతుందా అనే ఆలోచ‌న ఏపీలో నాయ‌కులకు త‌ట్టుతోంది… ముఖ్యంగా తెలంగాణ‌లో క‌లిసి పోటీ చేసేందుకు వచ్చే ఎన్నిక‌ల్లో సిద్దం అవుతున్నాయి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు..

Related imageఇప్పుడు ఏపీలో కూడా ఎటువంటి ఆలోచ‌న చేస్తున్నారు అనేది తాజాగా డెసిష‌న్ తో తెలిసిపోయింది. ఎంత నితీష్ కోరినా కేసీఆర్ స‌పోర్ట్ చేశారా తెలుగుదేశం చేసింది అని ఇక్క‌డ మ‌రో ఆలోచ‌న… ఇక తెలుగుదేశం కాంగ్రెస్ పోత్తుకు ఇది కాదా క‌రెక్ట అని సాక్ష్యం కూడా చెబుతున్నారు… ఇక తెలుగుదేశం ఆలోచ‌న ఎలా ఉన్నా రాజ‌కీయంగా ఈ విష‌యం పెనుచ‌ర్చ‌కు దారితీస్తోంది.. అయితే ఎన్టీఆర్ పార్టీ పెట్టింది కూడా కాంగ్రెస్ పై వ్య‌తిరేక‌త‌తో ..కాని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవ‌డానికి ఉవ్విళ్లూర‌డం పైకొంద‌రు అయితే మ‌ద‌న‌పడుతున్నారు… సొంత పార్టీ నేత‌ల‌కు కూడా ఈ విష‌యం మింగుడు ప‌డ‌నిదిగా ఉంది..