ఏపీలో ఎన్నిక‌ల హీటు స్టార్ట్

339

తెలుగుదేశం పార్టీ ఎన్నిక‌ల హ‌డావిడిలో మంచి బిజిగా ఉంది.. ఓ ప‌క్క తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ పొత్తుల‌తో ఎన్నిక‌ల్లో ముందుకు వెళుతుందా, లేదా అనే ఆలోచ‌న వ‌స్తోంది.. ఈ స‌మ‌యంలో రేపు తెలంగాణ అసెంబ్లీ రద్దు అనే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి.. మ‌రి ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎటువంటి నిర్ణ‌యం తెలుగుదేశం తీసుకుంటుంది అనేది ఇంకా తెలియ‌డం లేదు.. ఇక తెలంగాణ‌లో రాజ‌కీయం ప‌క్క‌న పెడితే ఏపీలో అధికారంలో ఉన్నారు కాబ‌ట్టి, ఇప్పుడు ఇక్క‌డ ఎన్నిక‌ల హీటు పెరిగే స‌రికి, రాజ‌కీయంగా మ‌రింత దూసుకుపోవాలి అని భావిస్తున్నారు.

Image result for chandra babu cabinet meeting

ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీకేడ‌ర్ ను మ‌రింత పార్టీకి ఉప‌యుక్తంగా మార్చుకోవాలి అని చూస్తున్నారు. పార్టీ భ‌విష్యత్తు కార్యాచ‌ర‌ణ‌పై నేడు విస్తృత స్ధాయి స‌మావేశం జరుగ‌నుంది. ఉండవల్లిలో జరిగే ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారు.. ఇక పార్టీ ఎలా కార్య‌క్ర‌మాలు ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాలి అని, నిర్ణ‌యం తీసుకోనున్నారు.

Image result for chandra babu cabinet meeting

గ్రామదర్శిని – గ్రామవికాసం కార్యక్రమం అమలు తీరుపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. కొన్నిచోట్ల కార్యక్రమం అనుకున్న రీతిలో జరగడం లేదని, లక్ష్యం కంటే వెనుకబడి ఉన్నారని ముఖ్యమంత్రి ఇటీవల పార్టీ నాయకులతో నిర్వహించిన ఒక సమావేశంలో కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. మ‌రి చూడాలి ఈ స‌మావేశంలో ఎటువంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో.