తెలుగు దేశం కోసం చేసిన యాడ్స్‌కు బోయపాటి ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా?

176

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి..నిన్నటి వరకు అన్ని పార్టీ లు తమ హామీలతో ఓటర్ల ఫై వరాల జల్లు కురిపించారు. ముఖ్యం గా తెలుగుదేశం , వైస్సార్సీపీ పార్టీ లు నువ్వా నేనా అనేంతగా ప్రచారం చేసి జనాల్లోకి వెళ్లారు.. అలాగే తెలుగ దేశం.. వైయస్సార్ సీపీ పార్టీలు ఈ ఎన్నికల్లో ప్రచారం కోసం పెద్ద ఎత్తున వాణిజ్య ప్రకటనల కోసం ఖర్చు చేసాయి. తమ పార్టీ అధినాయకుల్ని గెలిపించాల్సిందిగా ప్రాధేయపడుతూ రూపొందించిన ప్రకటనలు బుల్లితెరపై బాగా సందడి చేస్తున్నాయి. అయితే ఈ ప్రకటనల్లో టీడీపీ ప్రకటనలు బాగా ఆకట్టుకున్నాయి.

తెలుగు దేశం పార్టీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను, చేసిన అభివృద్దిని వివరిస్తూ చాలా యాడ్స్‌ వచ్చాయి. గత నెల రోజులుగా టీవీల్లో మారు మ్రోగి పోయాయి. తెలుగు దేశం పార్టీ యాడ్స్‌ ఆ పార్టీపై జనాల్లో ఆసక్తి కలిగేలా చేసిందే టాక్‌ కూడా వస్తుంది. క్వాలిటీ మరియు కంటెంట్‌ పరంగం టీడీపీ యాడ్స్‌ సినిమాల స్థాయిలో ఉన్నాయి అంటూ అంతా అనుకున్నారు. అలాంటి యాడ్స్‌ను చేసింది మరెవ్వరో కాదు బోయపాటి శ్రీను. ఆయన దర్శకత్వంలో ప్రతి ఒక్క యాడ్‌ కూడా సినిమా స్థాయిలో రూపొందింది.

అయితే ఆ యాడ్స్ కూడా ఓ రేంజిలో ఓవర్ డ్రామా తో ఉంటున్నాయి. యాడ్స్ లో కంటెంట్ , భారీతనం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి..అందరిలో చర్చనీయాశంగా మారుస్తున్నాయి. రీసెంట్ గా టీవీ ఛానెల్స్ లో వదిలిన యాడ్ అయితే మరీ వింతగా ఉంటోందని విమర్శలు వస్తున్నాయి.

ఆ యాడ్ లో ఒక అనాథ అమ్మాయికి గుడిలో పెళ్లి జరుగుతూంటుంది. అక్కడ .. ఆమె చంద్రబాబును తన అన్నగా చెప్తూ… లఘ్నపత్రికలో కుటుంబ పెద్దగా ఆయన పేరే రాయించటం. అందుకు కారణం చంద్రబాబు తమ వంటి వారికిచాలా చేసారంటూ చెప్తుంది. .. ఇలా సాగే ఈ ప్రకటన తాజాగా హాట్ టాపిక్ అవుతోంది.

మరొక యాడ్ లో …‘మీ కళ్లు ముందు కడుతున్న రాజధాని గ్రాఫిక్స్.. పోలవరం గ్రాఫిక్స్.. పారుతున్న నీళ్లు కూడా గ్రాఫిక్సేనరా…నీళ్లన్న చోట కన్నీరుండదని నమ్మిన మనిషిరా చంద్రబాబు.. అలాంటి మంచి మనిషికి ఓటేసి నిలబెట్టుకోవడం మన బాధ్యత’ అంటూ భారీ డైలాగ్ వస్తూంటాయి. బ్యాగ్రౌండ్‌లో అదిరిపోయే రీరికార్డింగ్ ఇదంతా బోయపాటి మార్క్ యాడ్స్ స్పెషాలిటీ.

ఈ ప్రకటన చూసి బోయపాటిని కొందరు…కంటెంట్ ని కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేసావని పొగిడుతూంటే..మరికొందరు … సెటైర్లు వేసేవాళ్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు మీద చాలా ఎమోషనల్‌గా సాగే ఒక పాటను కూడా బోయపాటి రెడీ చేసి వదిలాడు. ఆ పాట తెలుగు భారీ సినిమాలకు ఏమాత్రం తగ్గని స్థాయిలో హై స్టాండర్డ్స్‌లో, చాలా ఎఫెక్టివ్‌గా ఉండటం చెప్పుకోదగ్గ విషయం.

టీడీపీకి సంబంధించిన ప్రతి యాడ్‌ రూపకల్పనకు బోయపాటి ప్రత్యేక శ్రద్ద తీసుకుని రూపొందించాడు. టీడీపీతో బోయపాటి కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం యాడ్స్‌ మొత్తం నిర్వహణ ఆయనే. అంటే నటీనటుల, ఇతర విషయాలు అన్ని కలిపి బోయపాటి చూసుకోవాల్సి ఉంటుంది.

ఇందుకోసం టీడీపీ 5 కోట్ల రూపాయలను బోయపాటికి ఒప్పందంను అధికారికంగా కుదుర్చుకుంది. అయితే అనధికారికంగా మరో పది కోట్ల వరకు బోయపాటికి ముట్టినట్లుగా తెలుస్తోంది. నెల రోజుల పాటు టీడీపీ కోసం ఎన్నో యాడ్స్‌ను డిజైన్‌ చేయించినందుకు, యాడ్స్‌ షూట్‌ చేసినందుకు గాను బోయపాటి శ్రీను 15 కోట్ల రూపాయలతో పాటు, అధికారంలోకి వచ్చిన తర్వాత లాభంను కూడా పొందేలా అనధికారిక ఒప్పందం చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తానికి ఒక సినిమాను తీస్తే బోయపాటికి పది నుండి 12 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. కాని టీడీపీకి యాడ్స్‌ చేయడం వల్ల అంతకు మించిన డబ్బులు వచ్చాయి.

బోయపాటి నెల రోజుల్లోనే 15 కోట్ల రూపాయలు సంపాదించాడు అంటూ టాక్‌ వినిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ కోసం చేసిన యాడ్స్ కు బోయపాటి తీసుకున్న పారితోషకంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి..