అలా జ‌రిగే ఎన్నిక‌ల ప్ర‌చారం ఆపాలి – టీడీపీ

402

ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ వ‌చ్చేసారి ధీటుగా వైసీపీ జ‌న‌సేన‌కు స‌మాధానం చెప్పేందుకు రెడీ అవుతోంది.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షం జ‌న‌సేన ఎలా ఉన్నా ఆ రెండిటికి ఎంతో సపోర్ట్ ఉన్న సోష‌ల్ మీడియాని అరిక‌ట్టాలి అని చూస్తోంది.. అందులో భాగంగా తెలుగుదేశం నేత‌లు ఇప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియాపై ఆంక్ష‌లు పెట్టాలి అని చూస్తున్నారు ..ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కొత్త‌ప్లాన్ వేసింది అనే చెబుతున్నారు వైసీపీ నాయ‌కులు… ఇంత‌కి వీరు ఇంత‌లా విమ‌ర్శ‌లు చేస్తున్న‌దానికి కార‌ణం వింటే మీకు ఓ క్లారిటీ వ‌స్తుంది అని చెబుతున్నారు.. మ‌రి అది ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Image result for tdp
ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిన త‌ర్వాత సోష‌ల్ మీడియాలో ఇత‌ర ప్ర‌సార మాధ్య‌మాల్లో ప్ర‌చారం ఆపాలి అని కేంద్రం ఎన్నిక‌ల సంఘాన్ని తెలుగుదేశం పార్టీ కోరింది.. ఎన్నిక‌ల సంస్క‌ర‌ణ‌ల‌పై జ‌రిగిన స‌మావేశంలో వారి నిర్ణ‌యం ఈ మేర‌కు తెలియ‌చేశారు.. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

Image result for tdp

అయితే పోలింగ్ జ‌రిగే వ‌ర‌కూ ఇలా ప్ర‌చారానికి ఒప్పుకోవద్దు అని చెబుతున్నారు.. ఇక్క‌డ వ‌ర‌కూ బాగానే ఉంది.. ఎన్నిక‌ల ప్ర‌చారం త‌ర్వాత పోలింగ్ ముందు రోజే క‌దా అస‌లు రాజ‌కీయం జ‌రిగేది అని ఇటు నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.. అందుకే ఇటువంటి కొత్త ప్లాన్స్ తెలుగుదేశం వేస్తోంది అని, సోష‌ల్ మీడియాను నిలువ‌రించ‌లేక‌పోతున్నాం అలాగే వెబ్ మీడియాని ఏమీ చేయ‌లేక‌పోతున్నాం కేవ‌లం పత్రిక- శాటిలైట్ మీడియాని త‌మ ప‌రిధిలో ఉంచుకున్నాము అని వారు భావిస్తున్నారు అని ప్ర‌తిప‌క్షం విమ‌ర్శ‌లు చేస్తోంది.. మ‌రి 48 గంట‌లపాటు సోష‌ల్ మీడియా ప‌నిచేయ‌క‌పోతే ఎటువంటి ప‌రిస్దితి ఉంటుందో తెలిసిందే.