న‌గ‌రి సీటుపై టీడీపీ న‌యా రాజ‌కీయం

520

చిత్తూరు జిల్లాలో న‌గ‌రి రాజ‌కీయం ఇప్పుడు వార్త‌ల్లో చ‌ర్చ‌కు వ‌స్తోంది.. ఇక్క‌డ ఎమ్మెల్యేగా గ‌త ఎన్నిక‌ల్లో రోజా గెలిచారు వైసీపీ త‌ర‌పున.. ఇక తెలుగుదేశం త‌ర‌పున గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు పోటీ చేశారు.. అయితే ఆయ‌న మ‌ర‌ణంతో ఆయ‌న ఎమ్మెల్సీ ప‌ద‌విని కూడా ఆయ‌న భార్య స‌రస్వ‌త‌మ్మ‌కు ఇచ్చారు తెలుగుదేశం అధినేత‌… ఇక ఇక్క‌డ తెలుగుదేశం బాధ్య‌త‌లు ఎవ‌రికి ఇవ్వాలి అని, అనేకానేక స‌మావేశాలు చ‌ర్చ‌ల త‌ర్వాత తెలుగుదేశం – గాలి ఫ్యామిలీ అభిప్రాయాలు కూడా తీసుకుంది.

Image result for roja

ఇక గాలి కుమారుల్లో ఒక‌రికి అవ‌కాశం ఇవ్వాలి అని వారు భావించారు.. తాజాగా తెలుగుదేశం పార్టీ త‌ర‌పున వ‌చ్చే ఎన్నిక‌ల్లో గాలి ముద్దుకృష్ణ‌మ చిన్న‌కుమారుడు పోటికి నిలుస్తారు అని ఎమ్మెల్సీ గాలి స‌ర‌స్వ‌త‌మ్మ తెలియ‌చేశారు..ఎమ్మెల్సీ గాలి సరస్వతమ్మ వచ్చే ఎన్నికల్లో తన చిన్న కుమారుడు జగదీష్ టీడీపీ త‌ర‌పున న‌గ‌రి నుంచి పోటీ చేస్తారు అని ప్ర‌క‌టించారు.

Image result for chandra babu

. అయితే ఇక్క‌డ టీడీపీ జిల్లా నాయ‌క‌త్వం ఆమె వ్యాఖ్య‌ల‌ను ఖండించింది.. దీంతో ఇప్పుడు టీడీపీలో లుక‌లుక‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి…జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని మాట్లాడుతూ సరస్వతమ్మ చేసిన ప్రకటన కేవలం ఆమె వ్యక్తిగతమని, దానికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదన్నారు. పార్టీ త‌ర‌పున నిర్ణ‌యాలు, సీట్లు ఎవ‌రికి అనేది సీఎం నిర్ణ‌యం అని ఆయ‌నే ఫైన‌ల్ చేస్తారు అని జిల్లా అధ్య‌క్షుడు తెలియ‌చేశారు.

Image result for muddu krishnama naidu

అయితే ఆమె నేరుగా ఎందుకు ప్ర‌క‌టన చేస్తారు, చిన్న కుమారుడి విష‌యంలో సీఎంతో ఆమె మాట్లాడి త‌న‌చిన్న కుమారునికి మ‌ద్ద‌తు తెలపాలి అని కోరి ఉంటారు అని నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు. అయితే పార్టీలో తండ్రి త‌ర్వాత ఆ స్ధానం కోసం గాలి ముద్దుకృష్ణ‌మ పెద్ద కుమారుడు భాను ప్ర‌కాష్ ఎంతో కాలంగా చూస్తున్నారు.. ఆయ‌న న‌గ‌రి నుంచి పోటీ చేయాలి అని కోరుకుంటున్నారు.. ఇక న‌గ‌రి నుంచి టీడీపీ త‌ర‌పున వాణి విశ్వ‌నాధ్ కూడా పోటీచేస్తారు అనే వార్త‌లు గ‌తంలో వినిపించాయి.. మ‌రి ఫైనల్ గా ఎవ‌రు నిల‌బ‌డ‌తారో టీడీపీ త‌ర‌పున చూడాలి.. అలాగే వైసీపీ త‌ర‌పున ఎమ్మెల్యే రోజా మ‌రోసారి ఇక్క‌డ నుంచి పోటీకి రెడీగా ఉన్నారు అనేది తెలిసిందే.