కాపు రిజ‌ర్వేష‌న్ల పై టీడీపీ ఎంపీ పోరాటం

375

ఏపీలో కాపుల‌కు సంబంధించి రిజర్వేష‌న్ల అంశం పై ఇప్పుడు జ‌గ‌న్ తాజాగా స్పందిండంతో రాజ‌కీయంగా ఇది చ‌ర్చ‌నీయాంశ‌మైంది.. తెలుగుదేశం నాయ‌కులు కూడా ఎటువంటి మాట ఈ విష‌యం పై మాట్లాడ‌టం లేదు. ఇటు వైసీపీలో ఉన్న కాపు నాయ‌కులు కూడా తాము ఎటువంటి స్టెప్ వేయాలా అని ఆలోచిస్తున్నారు..

Related image

 

తాజాగా ఏపీకి ప్ర‌త్యేక హూదా కోసం కేంద్రంపై పోరాటం చేస్తున్నతెలుగుదేశం ఎంపీలు.. ఇక ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతున్న కాపు రిజర్వేషన్లసౌ కూడా గ‌ళం విప్పుతున్నారు… వెంటనే ఆమోదముద్ర వేసి రాజ్యాంగ సవరణ ద్వారా షెడ్యూల్‌ 9లో చేర్చాలని టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టుబడి. దానికి తగిన విధంగా కాపు రిజర్వేషన్‌ బిల్లు తీసుకొచ్చారని చెప్పారు.

Image result for అవంతి శ్రీనివాస్‌

అయితే 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీ ఎఫ్ – కేటగిరిలో వారిని చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారని, కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు ఆ జాబితాలో ఉన్నాయని తెలిపారు ఎంపీ అవంతి శ్రీనివాస్.. ఎప్ప‌టి నుంచో కాపులు రిజ‌ర్వేషన్ల‌కై పోరాటం చేస్తున్నార‌ని ఈ విష‌యం ప‌రిష్క‌రించే దిశ‌గా ఆలోచించాలి అని ఆయ‌న అన్నారు.. ఇప్ప‌టికే ఈ బిల్లును ఏడు నెల‌ల క్రితం పాస్ చేసి కేంద్రానికి గ‌వ‌ర్న‌ర్ పంపార‌ని ఎంపీ తెలియ‌చేశారు….ఈ విష‌యంలో కాపుల‌కు త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకుని బిల్ కు ఆమోద‌ముద్ర వేయాల‌ని ఆయ‌న లోక్ స‌భ‌లో కోరారు.