ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌గ‌న్ ముందే కండువా విసిరేసిన టీడీపీ ఎమ్మెల్యే జ‌గ‌న్ వార్నింగ్ వింటే షాక్

242

ఎన్నిక‌ల స‌మ‌యంలో రాజ‌కీయ నాయ‌కులు ఓ పార్టీ నుంచి మ‌రో పార్టీలోకి జంప్ అవ‌డం తెలిసిందే, సీటు కోసం పాట్లు ప‌డే నాయ‌కులు ఇప్పుడు చాలా మంది క‌నిపిస్తారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు పి.గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి షాక్‌ ఇచ్చారు. టీడీపీ టికెట్‌ దక్కకపోవడంతో వైసీపీలో చేరేందుకు వెళ్లి చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం టికెట్‌ను చంద్రబాబు వేరే వ్యక్తికి కేటాయించడంతో పులపర్తి టీడీపీకి రాజీనామా చేశారు. శనివారం వైసీపీలో చేరాలని నిర్ణయించుకుని పిఠాపురంలో జరిగిన జగన్‌ బహిరంగ సభకు హాజరయ్యారు. జగన్‌ ప్రసంగం ముగిశాక బస్సెక్కి ఆయనతో కరచాలనం చేసి కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం జగన్‌ కండువా వేసేందుకు ప్రయత్నించగా పులపర్తి తిరస్కరించారు. ఒప్పించేందుకు ప్రయత్నించినా అంగీకరించలేదు. జగన్‌ అవాక్కయ్యారు. తన చేతిలోనున్న కండువాను పక్కనున్న నేత చేతిలో పెట్టి పులపర్తిని పంపేయాలని సైగలు చేశారు.

ఈ క్రింది వీడియో చూడండి

ప్రజలకు అభివాదం చేసి పులపర్తి బస్సు దిగిపోయారు. తిరిగి వెళ్లిపోతూ మీడియాతో మాట్లాడారు. కొన్ని కారణాల వల్ల వైసీపీలో చేరలేదని, అక్కడ ప్రవర్తన, నియమాలు చూసి చేరకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. చంద్రబాబు తనకు చేసిన అన్యాయం పెద్దదేం కాదని చెప్పి వెళ్లిపోయారు. పులపర్తి తనకు ఎమ్మెల్సీ కావాలని అడిగారని.. ముందు మీరు పార్టీలో చేరండి… అన్ని విషయాలూ చర్చిద్దామని జగన్‌ ఆయనతో అన్నారని తెలిసింది. ఇదే సమయంలో జగన్‌ బలవంతంగా కండువా వేయడానికి ప్రయత్నించగా పులపర్తి ప్రతిఘటించారు. .. కొందరు వైసీపీ నాయకులు తనను బలవంతంగా పిఠాపురం తీసుకెళ్లారని, వైసీపీలో చేరితే ఉన్నత పదవి ఇస్తారని హామీ ఇచ్చారని చెప్పారు. అక్కడకు వెళ్లాక జగన్‌ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో తాను వెనుదిరిగివచ్చినట్లు తెలిపారు. టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. మొత్తానికి ఇలాంటి నాయ‌కుల‌ని చ‌ర్చించి పార్టీలోకి తీసుకురావాలి అని, లేక‌పోతే మీడియా ముందు అప‌హ‌స్యం అవుతామ‌ని, జ‌గ‌న్ త‌న పార్టీ నేత‌ల‌కు జిల్లా నాయ‌కుల‌కు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు అని తెలుస్తోంది.