వైసీపీ నేత ఇంటిపై టీడీపీ ఎమ్మెల్యే అమానుషం

257

తెలుగుదేశం పార్టీ నేత‌ల‌పై ఇప్పుడు ఆరోప‌ణ‌ల గొంతు అనేది పైకి వినిపిస్తోంది.. మ‌రీ ముఖ్యంగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరు మాజీ కార్పొరేట‌ర్ చింతా దుర్గారెడ్డి పై ఎమ్మెల్యే బుజ్జీ క‌క్ష పెంచుకున్నారు అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే వైసీపీలో ఉన్న ఆయ‌న్ని తెలుగుదేశంలోకి రావాలి అని పిలుస్తున్నార‌ట, దీనిపై ఎమ్మెల్యే బ‌డేటి బుజ్జీ పై ఆయ‌న ఫైర్ అయ్యారు.

Image result for badeti bujji

టీడీపీలో చేరకపోవడంతో ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఒత్తిడితో అయిదో డివిజన్‌లో నిర్మాణంలో ఉన్న మాజీ కార్పొరేటర్‌ చింతా దుర్గా రెడ్డి ఇంటిని మున్సిపల్‌ అధికారులు కూల్చివేశారు. ఈ దారుణ‌మైన ఘ‌ట‌న‌తో ఈ వివాదం బ‌య‌ట‌కు వ‌చ్చింది. టీడీపీలో చేర‌లేదు అని ఇలాంటి దారుణానికి పాల్ప‌డి నా ఇంటిని కూల్చివేశారు అని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Related image

ఇలాంటి నీచ రాజ‌కీయాల‌ను ఎమ్మెల్యే చేస్తున్నారు అని ఎమ్మెల్సీ ఆళ్ల‌నాని వైసీపీ నేత‌లు ఎమ్మెల్యేపై ఆరోప‌ణ‌లు చేశారు.. మాజీ కార్పొరేట‌ర్ కు అండ‌గా ఉంటాము అని తెలియ‌చేశారు. ఏపీలో టీడీపీ అరాచ‌కాలు పెరిగిపోయాయి అని ఎమ్మెల్యే బుజ్జీ ఇలా క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌డం పై వైసీపీ నేత‌లు అస‌హ‌నం ప్ర‌ద‌ర్శించారు..టీడీపీ ఎమ్మెల్యేకు ఆరునెల‌ల్లో ఏలూరు ప్ర‌జ‌లు స‌రైన బుద్దిచెబుతారు అని ఆయ‌న విమ‌ర్శించారు