టీడీపీ ఎమ్మెల్యేకు ఎదురు దెబ్బ

413

తెలుగుదేశం ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చే ప‌థ‌కాలు ఇప్ప‌డు ఆ పార్టీ నాయ‌కులు కొంద‌రికి పాజిటీవ్ అవుతుంటే, మ‌రి కొంద‌రికి నెగిటీవ్ అవుతున్నాయి..తూ.గో గ‌న్న‌వ‌రంలో లూటుకుర్రులో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యేకు చుక్కెదురైంది. ఈ కార్య‌క్ర‌మం పై ఇప్ప‌టికే అనేక చోట్ల నేత‌లు త‌మ ప్ర‌భుత్వం చేసిన ప‌నులు గురించి విస్తృత ప్ర‌చారం చేస్తున్నారు …అయితే నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు క‌నిపించ‌డం పెద్ద భాగ్యం అయిపోయింద‌ని, అందుకే వారు దొరికిన స‌మ‌యంలో అడ‌గాలి అని నిల‌దీయాలి అని ప్ర‌జ‌లు కూడా చూస్తున్నారు.

Image result for tdp flagగ్రామంలో పలు సమస్యలను తీర్చాలంటూ స్థానికులు ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తిని నిలదీశారు. అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తయినా, ఇప్పటివరకు గ్రామంలో సమస్యలు తీర్చడంలో విఫలమయ్యారని నిల‌దీశారు.. దీంతో తెలుగుదేశం నేత‌లు ఎమ్మెల్యే అవాక్క‌య్యారు.. క‌నీసం తాగునీటి స‌మ‌స్య తీర్చాలి అని కోరుతున్నారు. ఇక ఎమ్మెల్యేను ఇక్క‌డ స్దానికులు నిల‌దీయ‌డంతో ఆయ‌న వెంట‌నే ఆగ‌ష్టు నెలాఖరు క‌ల్లా మీ స‌మ‌స్య‌లు తీర్చుతా అని తెలియ‌చేశారు.. దీంతో అక్క‌డ ప‌లు స‌మస్య‌ల‌పై అర్జీలు తీసుకున్నారు స్దానికుల నుంచి.

Image result for tdp flag

 

ఇక ఫిరాయింపుల‌కు కూడా ఇటువంటి ప‌రిస్తితే వ‌స్తోంది… పార్టీ మారింది అభివృద్దికి అని చెబుతున్నారు.. మ‌రి అభివృద్ది ఏమి చేస్తున్నారు అని ప్ర‌శ్నిస్తున్నారు… తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయ‌కులు ఎవ‌రు ఎలా ఉన్నా ఫిరాయింపు నాయ‌కుల‌కు ఈ ప‌థ‌కాలు – కార్య‌క్ర‌మాల‌తో మ‌రింత హీట్ పెరుగుతోంది ప్ర‌జ‌ల‌నుంచి.