ప‌వ‌న్ కు టీడీపీ ఎమ్మెల్యే కౌంట‌ర్

326

జ‌న‌సేన అధినేత రాజ‌కీయా్లో ఫ్రెండ్స్ కుటుంబ స‌భ్యులు ప్ర‌జ‌లు అంద‌రూ స‌మాన‌మే అనేలా చెబుతున్నారు.. ఆయ‌న కూడా అదే పాటిస్తున్నారు తాజాగా ఆయ‌న పశ్చిమ‌గోదావ‌రి జిల్లాలో పర్య‌ట‌న‌లో ప‌లు అంశాలు ప్ర‌స్తావిస్తున్నారు.. ముఖ్యంగా ఇక్క‌డ చాలా సెగ్మెంట్ల‌లో జ‌న‌సేన బ‌లీయంగా ఉంది. అది పార్టీకి మరింత పాజిటీవ్ చేసుకోవాలి అని ఆయ‌న భావిస్తున్నారు.

తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలపై ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి స్పందించారు. తనపై చేసిన విమర్శలను పవన్ కల్యాణ్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అంటే తనకు భయం లేదని, ఆయన తనకు 40ఏళ్లుగా స్నేహితుడన్న సంగతి ఈ ప్రాంత వాసులకు తెలుసన్నారు. అలాగే భయపడే తత్వం తన రక్తంలో లేదని, స్కూలు భూములు కబ్జా చేసానంటున్నారు…

Image result for బడేటి బుజ్జి

ఇలాంటి విష‌యాల్లో ప‌వ‌న్ ఏదైనా ఆధారాల‌తో మాట్లాడాలి అని ఆయ‌న అన్నారు. ఇక వీటి పై కౌంట‌ర్లు వేసిన ఆయ‌న ఇలా విమ‌ర్శ‌లు చేసిన వ‌న్ ఈ ఆరోప‌ణ‌ల‌ను సాక్ష్యాల‌తో సహ నిరూపించగలరా అంటూ పవన్‌ను ప్రశ్నించారు. ఏలూరులో తన హయాంలో ఎటువంటి పేకాట క్లబ్బులు రాలేదు.. ఉన్న ఒక్క టౌన్ హాల్ కొంతమంది పెద్దలు చాలాకాలం క్రితం ఏర్పాటు చేసుకున్నారు… అని బడేటి బుజ్జి అన్నారు. అలాగే లోకేష్‌కు శేఖర్‌రెడ్డికి సంబంధాలు ఉన్నాయని గతంలో పవన్ కల్యాణ్ ఆరోపణలు చేశారని, ఇప్పటికీ వాటిని నిరూపించలేకపోయారని ఆయన అన్నారు. ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు క‌రెక్ట్ అని నిరూపిస్తే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాను అని అన్నారు బుజ్జీ..