జ‌న‌సేన వైపు ఆ మంత్రి చూపులు

373

తెలుగుదేశం పార్టీలో ఓ సీనియ‌ర్ మంత్రి జ‌న‌సేన త‌ర‌పున వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీచేయ‌డానికి రెడీ అవుతున్నారు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి.. ఉత్త‌రాంధ్రా జిల్లాల‌కు చెందిన ఆ మంత్రి ఇప్పుడు జ‌న‌సేనలో చేరాలి అని అనుకుంటున్నారు అనేది వార్త. అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు ఎన్నిక‌ల‌కు ముందు బాబు టికెట్ ఇచ్చినా ఇవ్వ‌క‌పోయినా ఆయ‌న పార్టీ మారే అవ‌కాశం ఉంది అని అంటున్నారు… తెలుగుదేశం త‌ర‌పున ఆయన్ని సెంట‌ర్ చేస్తున్నా, సీఎం – సీనియ‌ర్లు వారిని వెన‌కేసుకు వ‌స్తున్నారు అని ఇటు లోకేష్ కూడా వారికి స‌పోర్ట్ గా ఉన్నారు అని ఆయ‌న మద‌న‌ప‌డుతున్నార‌ట..

Image result for tdp

ఇక జిల్లాలో రెండు మూడు సీట్లు కూడా త‌న మద్దతుదారుల‌కు ఇప్పించుకునే సీన్ తెలుగుదేశంలో త‌న‌కు లేదు అని… ఇక ఇక్క‌డ ఉండి లాంటి విమ‌ర్శ‌లు ప‌డ‌టం కంటే పార్టీ మారి త‌న దారి తాను చూసుకుంటాను అని అంటున్నాడు.. సో రాజ‌కీయంగా ఆయ‌న‌కు జ‌నసేన స‌పోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అని తెలుస్తోంది..ఇప్పుడు ఉత్త‌రాంధ్రాలో ఆయ‌న ఎవ‌రికి సీట్లు టిక్కెట్లు ఇవ్వాలి అని చెప్పినా వారికి ఇచ్చేలా ప్లాన్ వేస్తున్నారు అని తెలుస్తోంది.

Image result for janasena

దీనికి మంత్రి కూడా ఒకే చెప్పారు అని తెలుస్తోంది… ఇటు వైసీపీ నుంచి పిలుపు వ‌చ్చినా అక్క‌డ తెలుగుదేశం త‌ర‌పున ఉన్న నాయ‌కుల‌క‌న్నా ఎక్కువ మంది పార్టీలో ప‌ద‌వుల కోసం ఉన్నారు అని ఆయ‌న వైసీపీలో చేరే ఛాన్స్ వ‌దిలేశారు అని అంటున్నారు… ఆయ‌న జ‌న‌సేన పార్టీలో చేరిక ఉంటుంది అని తెలుగుదేశం త‌ర‌పున ఉన్న సీనియ‌ర్లు జూనియ‌ర్ల‌కు అంద‌రికి తెలుస్తోంది.. ఇక తెలుగుదేశం త‌ర‌పున ఉన్న సీనియ‌ర్లు ఇప్ప‌టికే బుజ్జ‌గింపుల ప్ర‌క్రియ స్టార్ట్ చేశారు అని అంటున్నారు.