టిడిపి మంత్రికి కారు ప్రమాదం..షాక్ లో చంద్రబాబు..

511

ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు కాల్వ శ్రీనివాసులు కారు కు యాక్సిడెంట్ అయింది..అయితే ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయట పడ్డారు..అనంతపురం జిల్లాలోని బెళుగుప్ప మండలం కాలువపల్లి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుండి ఆయన క్షేమంగా బయటపడడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు. పక్కనే వెళ్తున్న మరో కారు టైరు పేలి మంత్రి కాన్వాయ్‌ను రాసుకుని వెళ్లింది. దీంతో మంత్రి వాహనం వెనుక భాగం బాగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. ప్రమాద సమయంలో కారులో కాల్వ శ్రీనివాసుతో పాటు జడ్పీ ఛైర్మన్‌ పూల నాగరాజు ఉన్నారు…

టీడీపీ సీనియర్‌ నాయకుడు బాదన్న వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడానికి అనంతపురం నుంచి కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామానికి వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న మరో కారు టైరు పంక్చరై అదుపుతప్పి మంత్రి కాన్వాయ్‌ వాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో కారు స్వల్పంగా దెబ్బతినగా మంత్రి, జడ్పీ చైర్మన్‌లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాద ఘటన తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు , వెంటనే మంత్రికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.