బాబుపై వ్యాఖ్య‌లు టి. టీడీపీ నిప్పులు

325

తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం జోరు అందుకుంది అని చెప్పాలి.. కేసీఆర్ న‌ల్గొండ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో ప్ర‌జ‌ల‌తో స‌భ‌లో మాట్లాడిన స‌మ‌యంలో, టీడీపీ అధినేత‌పై, కాంగ్రెస్ పై చేసిన కామెంట్లు పెద్ద ఎత్తున వైర‌ల్ అయ్యాయి.. నీ అయ్య జాగీరా తెలంగాణ అంటూ తెలంగాణ నాయ‌కులు టీఆర్ ఎస్ మినహా మిగిలిన పార్టీల నేత‌లు విమర్శించారు. కేసీఆర్ ఏపీ సీఎం చంద్ర‌బాబు పై తీవ్ర‌స్ధాయిలో విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే . చంద్ర‌బాబుతో పొత్తు పెట్టుకున్నారా అని త‌న‌ని అడిగితే నాలుగు సీట్లు ఇచ్చేవాడిని క‌దా అని విమ‌ర్శించారు కేసీఆర్.

Image result for chandra babu

నాలుగు సీట్లు ఎవ‌రికి ప‌డేస్తావు కేసీఆర్ ఇది నీ రాజ్యం కాదు అని టీడీపీ-టీఎస్‌ అధ్యక్షుడు ఎల్‌.రమణ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్‌ గురించి, టీడీపీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసీఆర్‌ ప్యాంటు, చొక్కా ఊడదీసి కొడతామని హెచ్చరించారు.
దొంగ పాస్‌పోర్టులు, వీసాలు ఇప్పించిన కేసీఆర్ దంతా దొంగ బతుకే. తనేదో శ్రీరామచంద్రుడి తమ్ముడినన్నట్లుగా మాట్లాడుతున్నాడు. రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు.

Image result for chandra babu

కావాల‌నే తెలంగాణ‌లో ముంద‌స్తుకు రెడీ అయ్యాడు అలాగే మోదీతో కలిసి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నాడు అని, కావాల‌నే రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తున్నారు అని ఆయ‌న విమ‌ర్శించారు. తెలంగాణ‌లో మహాకూటమితో టీఆర్‌ఎస్‌ పునాదులు కదిలిపోతున్నాయని, మానసిక ఒత్తిడికి లోనైన కేసీఆర్‌ దిగజారి మాట్లాడుతున్నాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు..మొత్తానికి బాబుపై ఘాటు వ్యాఖ్య‌లుచేసిన కేసీఆర్ పై తెలంగాణ టీడీపీ ఘాటుగానే స్పందిస్తోంది.