టీడీపీలో సీట్ల పై ఫీట్లు

354

తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్ర‌బాబు వ‌చ్చేఎన్నిక‌ల్లో గెలుపుగుర్రాలుఎవ‌రు అనే దానిపై ఇప్ప‌టి నుంచే స‌ర్వేలు చేస్తున్నారు.. విజ‌యం ఎవ‌రికి వ‌రిస్తుందో వారికి టిక్కెట్లు ఇవ్వాలి అని చూస్తున్నారు.. ముఖ్యంగా వారసుల‌కు టిక్కెట్లు ఇవ్వాలి అనుకుంటే అక్క‌డ విజ‌యం వార‌సుల‌కు రాదు అని, అనిపిస్తే కుమారుల‌కు వార‌సుల‌కు సీటు లేదు, మీరు పోటీ చేస్తే చేయండి లేక‌పోతే వేరేవారికి ఇస్తాము అని తెలియ‌చేస్తున్నారట‌.. సార్వ‌త్రిక ఎన్నిక‌లకు మ‌రో తొమ్మ‌ది నెల‌లు మాత్ర‌మే స‌మ‌యం ఉంది.. ఈ స‌మ‌యంలో వ‌చ్చే ఎన్నిక్ల‌లో విజయం కోసం ఇప్ప‌టికే పార్టీలు స‌మాయ‌త్తం అవుతున్నాయి.

Image result for chandra babu

మ‌రోపక్క వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర, ఇటు జ‌న‌సేనాని పోరాట యాత్ర‌ల‌తో బిజీ బిజీగా ఉన్నారు.. దీంతో తెలుగుదేశం పార్టీ కూడా రెడీ అయింది.. గెలుపు గుర్రాలు మూడు నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి టిక్కెట్లు ఇవ్వాలి అని, వారి వార‌సుల‌కు వ‌చ్చేసారి అవ‌కాశం ఇవ్వాలి అని చూస్తున్నారు.. ఏ నాడు లేని విధంగా ఈసారి ఎన్నిక‌లు ఉండ‌బోతున్నాయి.. నాడు వైయ‌స్- చిరంజీవి- చంద్ర‌బాబు 2009 ఎన్నిక‌ల్లో ఎలా పోరాటం చేశారో ? ఇప్పుడు కూడా ప‌వ‌న్ చంద్ర‌బాబు జ‌గ‌న్ మ‌ధ్య‌ పోటీ ఉంటుంది అని తెలుస్తోంది.

Image result for lokesh

దీంతో చంద్ర‌బాబు కూడా రాజ‌కీయంగా ఎటువంటి మైలేజ్ వ‌చ్చినా వ‌దులుకోకూడ‌దు అని చూస్తున్నారు.. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే టిక్కెట్ల విష‌యంలో 20 మందికి తేల్చిచెప్పింద‌ట.. ఒక‌వేళ మీ వార‌సుల‌కు టికెట్ కావాలి అంటే 2024 వ‌ర‌కూ ఆగాల్సిందే అని ఫైన‌ల్ గా చెప్పేశార‌ట‌. ..ఇక మంత్రిలోకేష్ ద‌గ్గ‌ర చెప్పి ఇటు చంద్ర‌బాబుతో మాట్లాడాలి అని మ‌రోసారి సీట్ల విష‌యంలో ఆలోచించాలి అని యోచిస్తున్నారు కొంద‌రు.. కాని ఇప్పుడు ఈ నిర్ణ‌యంపై ఎటువంటి మార్పు ఉండ‌దు అని మంత్రి కూడా తెలియ‌చేశార‌ట‌. సో టీడీపీలో కూడా ఇప్ప‌టికే సీట్ల‌పై ఓ క్లారిటీ వ‌స్తోంది అనేది తెలుస్తోంది.