కిడారి హ‌త్య‌లో టీడీపీ నేత‌ల హ‌స్తం

247

అర‌కు ఎమ్మెల్యే కిడారి అలాగే మాజీ ఎమ్మెల్యే సొమ‌హ‌త్య‌ల వెనుక కార‌ణాలు ఏమిటి వీరి వెనుక ఉన్న‌ది ఎవ‌రు అనేది ఇప్పుడు ప్ర‌భుత్వం పోలీసుల‌తో విచార‌ణ చేయిస్తోంది అయితే అక్క‌డ స్ధానిక ఎంపీటీసీలు జెడ్పీల ద్వారా ఈ దారుణం జ‌రిగింది అని తెలుగుదేశం నేత‌లే ఇటువంటి దారుణాకి సాయం చేశారుఅ ని తెలుస్తోంది.అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యకు టీడీపీ నేతలే కారణమని స్పష్టమైందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఇక పార్టీ మారారు అనే కార‌ణంతో టీడీపీ అధినేత దీనికి ముడిపెట్టాలి అని అనుకున్నారు కాని ఇది ఎంత వ‌ర‌కూ స‌బ‌బు కాదు పోలీసుల విచార‌ణ‌లో దీని మొత్తం విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి అని ఆయన అన్నారు.

Image result for kidari sarveswara rao

చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులను తుది ముట్టించడంలో ఆరితేరారన్నారు. గతంలో వంగవీటి రంగా హత్యలో చంద్రబాబు పాత్ర ఉందని హరిరామ జోగయ్య స్పష్టం చేశారని గుర్తు చేశారు. రాఘవేంద్ర రావు అనే అధికారి, పరిటాల రవి హత్యల వెనుక చంద్రబాబు పాత్ర ఉందని టీడీపీ నేతలే చెబుతున్నారని తెలిపారు.. తమ పార్టీకి ద్రోహం చేసిన ఎమ్మెల్యే కిడారి.. తన మరణ వాంగ్మూలంలో పార్టీ మారినందుకు రూ. 12 కోట్లు తీసుకున్నట్లు చెప్పారని ఆయన గన్‌మెన్‌లే చెబుతున్నారని, ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్టు కొన్నారనేదానికి ఇంతకంటే ఇంకేం ఆధారం కావాలన్నారు.

Image result for kidari sarveswara rao

మైనింగ్‌ కోసమే సర్వేశ్వరావు టీడీపీలో చేరాడని అనడానికి చాలా ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. మైనింగ్ గొడవల వల్లనే టీడీపీ స్థానిక నేతలు మావోయిస్టులతో చేతులు కలిపారని తేలిందన్నారు.ఇక ఇలాంటి విష‌యంలో చంద్ర‌బాబు స‌ర్కారు అలాగే బాబు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో తెలిసిందే, దీనిపై వైసీపికి ఓ ప్ర‌చారం అంట‌గ‌ట్టాలి అనిఅనుకున్నారు ఇది ఏమాత్రం క‌రెక్ట్ కాదు అని ఆయ‌న అన్నారు.