మంత్రి సునీత ముందు త‌మ్ముళ్ల ఫైట్ ఐదు రూపాయ‌ల కోసం

463

అనంత‌పురం జిల్లాలో పరిటాల ఫ్యామిలీ, జేసీ ఫ్యామిలీ తెలుగుదేశంలో రాజ‌కీయంగా ఎదిగిన కుటుంబాలుగా, బ‌ల‌మైన రాజ‌కీయ శ‌క్తులుగా పేరు తెచ్చుకున్నారు… జేసి కాంగ్రెస్ నుంచి వ‌చ్చినా ఇక్క‌డ బ‌ల‌మైన నేత‌గా టీడీపీలో ఉన్నాడు.. ఇక్క‌డ కేడ‌ర్ వీరి ఇద్ద‌రికి ఎంత ఉన్నా, సొంత పార్టీలో వ‌ర్గ‌పోరుతో ఇరువురికి మ‌ధ్య వివాదాలు మ‌రింత వ‌స్తూ ఉంటాయి.. తాజాగా తెలుగుదేశం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన గ్రామ‌ద‌ర్శ‌ని – గ్రామ‌వికాసం కార్య‌క్ర‌మం మంత్రి ప‌రిటాల సునీత‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది..

Image result for paritala sunitha

పార్టీలో విభేదాలు పెరిగిపోయాయ‌ని, అలాగే పార్టీ నాయ‌కులు కేడ‌ర్ ప్ర‌జా స‌మ‌స్య‌లు తీర్చ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు అని అన‌డంతో మంత్రి సునీత‌కు చుక్కెదురైంది…కనగానపల్లి మండలం చంద్రశ్చర్లలో మంత్రి సమక్షంలోనే తమ్ముళ్లు ఘర్షణ పడ్డారు.

Related image
ఈ ప్రాంతం టీడీపీకి ఏ నాటి నుంచో ప‌ట్టు ఉన్న ప్రాంతం…ఈ గ్రామంలో మంత్రి ఏకపక్షంగా ఓ వర్గానికే మద్దతు తెలుపుతుండడంతో విభేదాల చిచ్చు వ‌చ్చింది. ఇంతకాలం అవకాశం కోసం కాచుకుని ఉన్న అసమ్మతి వాదులకు మంత్రి రాక ఓ వరంలా మారింది. గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్‌ ప్లాంట్‌ ద్వారా ఐదు రూపాయ‌ల‌తో నీటిని అమ్ముకుంటున్నారంటూ సర్పంచ్‌ రామసుబ్బయ్యకు వ్యతిరేకంగా పలువురు మంత్రికి ఫిర్యాదు చేశారు.

Image result for paritala sunitha

దీంతో ఇరువ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదం మ‌రింత పెరిగింది….గ్రామ సర్పంచ్‌ వర్గీయులు ఫిర్యాదు చేసిన రామకృష్ణ, సాయిరాం వర్గీయులపై దాడికి దిగారు. మంత్రి వారిస్తున్నా వారు వినకుండా ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకున్నారు…ఇక మంత్రి కూడా ఇలా వివాదం జ‌ర‌గ‌డంతో కార్య‌క్ర‌మం మ‌ధ్య‌లోనే ముగించుకుని అక్క‌డ నుంచి వెళ్లిపోయారు.