టీడీపీకే ఈ సెగ్మెంట్లో అవ‌కాశం

405

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆశావాహుల జాబితా పెరిగిపోతోంది.. ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు సీట్లు కావాలి అంటే త‌మ‌కు సీట్లు కావాలి అని నేత‌లు కోరుకుంటున్నారు.. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో వైసీపీలో సీనియ‌ర్ నేత త‌న అల్లుడి కోసం సీటు కావాలి అని కోరుతున్నారు.. ఆ సెగ్మెంట్ తెనాలి.. ఇక్క‌త త‌న అల్లుడికి టికెట్ ఇవ్వాలి అని జ‌గ‌న్ ని కోరుతున్నార‌ట సీనియ‌ర్ నేత‌. మ‌రో ప‌క్క ఇండ‌స్ట్రీలిస్ట్ తెలంగాణ‌లో సెటిల్ అయినఓ పారిశ్రామిక వేత్త కుమారుడు కూడా ఇక్క‌డ టికెట్ కోరుకుంటున్నారు. ఆర్ధికంగా పారిశ్రామిక వేత్త అయి ఉండ‌టంతో ఈ సెగ్మెంట్లో గెలుపు న‌ల్లేరుమీద నడ‌క అనే అభిప్రాయంతో ఉన్నారట‌.

Image result for alapati raja

ఇక్క‌డ‌ తెలుగుదేశం త‌ర‌పున సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల‌పాటి ఉన్నారు. అయితే ఇక్క‌డ పార్టీ త‌ర‌పున కార్య‌క్ర‌మాలు ముందుకు తీసుకువెళుతున్నా వ‌ర్గ‌పోరు లేక‌పోయినా పార్టీ విజ‌యం కోసం ఆల‌పాటి ముందు వ‌రుస‌లో ఉన్నారు.. అయితే తెలుగుదేశం మ‌రింత ఇక్క‌డ ఆయ‌న‌కు స‌హకారం అందిస్తే వైసీపికి స‌రైన అభ్య‌ర్ది రాజా అని అంటున్నారు టీడీపీ కేడ‌ర్.

Image result for alapati raja

అలాగే వైసీపీలో ఈ సీట్ల ఆట‌ల మ‌ధ్య టికెట్ ఎవ‌రికి వ‌స్తుంది.. ఒక‌వేళ వేరేవారికి టికెట్ వ‌చ్చినా వీరు వారికి స‌హ‌కారం అందిస్తారా అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న.. అందుకే తెలుగుదేశం వైసీపీ త‌ర‌పున ఇక్క‌డ టిక్కెట్ల ఫైట్ కొన‌సాగుతోంది.. టీడీపీ త‌ర‌పున ఆల‌పాటికి టికెట్ క‌న్ఫామ్. మ‌రి వైసీపీ త‌ర‌పున ఎవ‌ర‌కి టికెట్ అనేది మాత్రం ఇక్క‌డ స‌స్పెన్స్ అనే చెప్పాలి.