అనంత‌లో టీడీపీ ఆ రెండు సీట్ల‌పై ఫోక‌స్

388

తెలుగుదేశం పార్టీ అనంత‌పురం జిల్లాలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాలి అని భావిస్తోంది… ముఖ్యంగా జేసి కుటుంబం అలాగే ప‌రిటాల కుటుంబాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండ‌టంతో పార్టీ త‌ర‌పున విజ‌యం త‌థ్యం అని భావిస్తున్నారు… ఇక జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ రెండు సెగ్మెంట్లు గెలుచుకుంది.. ఇప్పుడు ఆ రెండు సెగ్మెంట్లు వైసీపీ గెలిచే ఆస్కారం లేకుండా చెయ్యాలి అని భావిస్తున్నారు తెలుగుదేశం నాయ‌కులు..

Image result for tdp

ఇక వైసీపీ నుంచి పార్టీ ఫిరాయించిన క‌దిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషాకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం త‌ర‌పున టికెట్ వ‌స్తే ఒకే, లేక‌పోతే కొత్త వ్య‌క్తికి ఇవ్వాలి అని భావిస్తున్నారు అనే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి… ఇక కేపీకి ఇచ్చే అవకాశం కూడా ఉంది..అలాగే జిల్లాలో మ‌రో సెగ్మెంట్ ఉర‌వ‌కొండ… ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో విశ్వేశ్వ‌ర‌య్య వైసీపీ త‌ర‌పున గెలిచారు ..ఇక ఆయ‌న‌పై పోటీ చేసిన ప‌య్యావు కేశ‌వ్ ఓట‌మిపాల‌య్యారు..

Image result for tdp

ఇక త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన తెలుగుదేశం పార్టీ ప‌య్యావుల‌ కేశ‌వ్ కు త‌ర్వాత ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చారు… ఇప్పుడు ఈ రెండు సెగ్మెంట్లు విజ‌యానికి దారులుగా చేసుకోవాలి అని తెలుగుదేశం భావిస్తోంది…. ముఖ్యంగా మైనార్టీ కోటాలో మ‌త్రి ప‌ద‌వి ఇవ్వాలి అని అనుకుంటున్న‌నేత‌లో క‌దిరి ఎమ్మెల్యే ఫిరాయింపు నేత అత్తార్ చాంధ్ బాషా ఉన్నారు.. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తే జిల్లాలో రెండు సెగ్మెంట్లో విజ‌యం వ‌చ్చే ఎన్నిక‌ల్లో సుల‌భం అవుతుంది అని భావిస్తున్నారు.. ఇటు ఎమ్మెల్సీగా ఉన్న ప‌య్యావుల వ‌చ్చే ఎన్నిల‌క‌లో పోటీ చేయ‌డం త‌థ్యం ఆయ‌న సోద‌రుడు కాకుండా ఆయ‌నే పోటీ చేసే అవ‌కాశః ఉంటుంది.. దీంతో ఆయ‌న‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు చాలా సుల‌భం అని అంటున్నారు నేత‌లు.

Image result for payyavula keshav

అంతే కాకుండా తెలుగుదేశంపార్టీ ఇక్క‌డ జిల్లాలో జేసి – ప‌రిటాల కుటుంబాల‌తో వ‌చ్చే ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ సాధించాలి అని చూస్తున్నారు. జిల్లాలో అన్నీ సీట్లు సాధించేందుకు ప్ర‌ణాళిక ర‌చిస్తున్నారు.. ఇక ఎంపీ సెగ్మెంట్లో కూడా హిందూపురం, అనంత‌పురంలో టీడీపీ కంచుకోట‌గా భావిస్తోంది.. ఈసారి హిందూపురం నుంచి ఎవ‌రు అనేది ఇంకా ఫైన‌ల్ కాక‌పోయినా, అనంత‌పురం నుంచి మాత్రం జేసి ప‌వ‌న్ నిల‌బ‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి..