టీడీపీకి బిగ్ షాక్ వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే ముహూర్తం ఫిక్స్

218

తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మి రావ‌డంతో పార్టీకి ఒక్కొక్క‌రు రాజీనామా చేస్తున్నారు.. మ‌రికొంద‌రు వేరే పార్టీల వైపు చూస్తున్నారు.. తాజాగా విశాఖపట్నం జిల్లా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత పంచకర్ల రమేశ్‌బాబు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. వచ్చే నెల ఎనిమిదవ తేదీ విజయదశమి రోజున ఆయన వైసీపీ కండువా వేసుకునేందుకు ముహూర్తం పెట్టుకున్నట్టు తెలిసింది. అందులో భాగంగానే బుధవారం చినముషిడివాడలోని శారదా పీఠానికి వెళ్లి స్వరూపానందేంద్ర సరస్వతిని దర్శించుకున్నట్టు ఆయన ముఖ్య అనుచరులు చెబుతున్నారు.

Image result for jagan

ఇటీవల ఎన్నికల్లో ఎలమంచిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పంచకర్ల…వైసీపీ అభ్యర్థి కన్నబాబురాజు చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీ కార్యకాలాపాలకు దూరంగా వుంటూ వస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ద్వారా ఆ పార్టీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. అటు నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో వచ్చే నెల ఎనిమిదవ తేదీన వైసీపీ కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన పంచకర్ల 2009లో పెందుర్తి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. త‌ర్వాత పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో కాంగ్రెస్‌లో కొనసాగారు. రాష్ట్ర విభజన త‌ర్వాత 2014లో టీడీపీలో చేరిన పంచకర్ల ఎలమంచిలి నుంచి పోటీ చేసి గెలుపొందారు. పార్టీ రూరల్‌ అధ్యక్షునిగా నియమితులయ్యారు. 2019 ఎన్నికల్లో రూరల్‌లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాకపోవడంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇలా తెలుగుదేశం పార్టీ కూడా ఆయ‌న‌కు మూడో పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉంటే అక్క‌డ ఎలాంటి ప‌నులు ముందుకు సాగ‌వు అని తెలిసి వైసీపీలో చేరాలి అని భావిస్తున్నారు అయితే జ‌గ‌న్ ఆయ‌న‌కు ప‌ద‌వి ఏమైనా ఆఫ‌ర్ చేశారా, లేదా ఆయ‌నే స్వ‌యంగా ఎలాంటి హ‌మీ లేకుండా వెళుతున్నారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.