ఫిరాయింపు నేత‌కు టీడీపీ షాక్

524

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా స‌రే ఫిరాయింపుల వ‌ల్ల పార్టీలో ప‌రిస్దితి మొత్తం మారిపోయింది.. వైసీపీ నుంచి నాయ‌కులు ఇందులో చేర‌డం, వారు ప‌ద‌వులు అధిరోహించ‌డం, ఇక్క‌డ ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ‌చేస్తున్న నాయ‌కుల‌కు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి.. ఇక కృష్ణా జిల్లాలో సొంత పార్టీలో నాయ‌కుల మ‌ధ్య విభేదాలు మ‌రింత పెరిగాయి అనే చెప్పాలి అధికార పార్టీలో.

Related imageగుడివాడ మున్సిపల్‌ ఛైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావుపై అవిశ్వాసం ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతానికి నోటీసు అందించిన తెలుగుదేశం పార్టీ ఫ్లోరు లీడరు లింగంప్రసాద్‌, ఆయనకు మద్దతు తెలిపిన నాయకులతో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు భేటీ అయ్యారు.

Image result for tdpమంత్రి క్యాంపు కార్యాలయంలో గుడివాడ టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రావి వెంకటేశ్వరరావు నేతృత్వంలో అసమ్మతి నేతలతో సమావేశం నిర్వహించారు. ఛైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావును పదవి నుంచి దింపాలని వారు డిమాండ్‌ చేశారు. ఛైర్మన్‌ అభ్యర్థిగా పోటీచేసి అనేక వ్యయప్రయాల కోర్చిన లింగం ప్రసాద్‌ను ఛైర్మన్‌గా చేయాలని కోరారు. ఈ విషయమై మంత్రి దేవినేని ఉమా స్పందిస్తూ పార్లమెంటులో తెదేపా ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానం నేడు చ‌ర్చ‌కు రానుంది..

Image result for jagan and chandra babu

ఈ విష‌యంతో నేత‌లు బిజీగా ఉన్నారు త‌ర్వాత ఈ విష‌యంలో ఓ తుది నిర్ణ‌యం తీసుకుందామ‌ని ఆయ‌న నాయ‌కుల‌కు స‌ర్దిచెప్పారు.. అత‌న్ని మార్చ‌డానికి ముందు సీఎంతో అలాగే ఎంపీతో జిల్లా అధ్య‌క్షునితో మాట్లాడాలి కాని, అవిశ్వాసం పై చ‌ర్య సంద‌ర్బంగా వారు బీజీగా ఉండ‌టంతో ఈ విషయం ప‌క్క‌న పెట్టారు అని తెలుస్తోంది… మ‌రో వారంలో ఈ స‌మ‌స్యకు ప‌రిష్కారం వ‌స్తుంద‌ని అప్ప‌టి వ‌రకూ శాంతంగా ఉండాల‌ని మంత్రి తెలియ‌చేశారు.