టీడీపీ 50 మంది లిస్ట్ రెడీ

403

తెలుగుదేశం పార్టీ వ‌చ్చే ఎన్నిక‌లకు ఇప్ప‌టి నుంచి సిద్దం అవుతోంది.. వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టి నుంచే 50 మంది అభ్య‌ర్దుల‌ను ముంద‌స్తుగా ప్ర‌క‌టించాలి అని భావిస్తోంది.. దీనికి అనుగుణంగా పార్టీ త‌ర‌పున సీనియ‌ర్లు – జూనియ‌ర్లు కూడా త‌మ‌కు అవ‌కాశం వ‌స్తుందా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్కుతుందా అని చూస్తున్నారు.. అయితే పార్టీలో ఆశావాహులు ఎంద‌రు ఉన్నా, సీఎం మాత్రం కొంద‌రికి తాను అనుకున్న‌వారికి మాత్ర‌మే టికెట్ ఇస్తారు.. ఇందులో మొద‌టి వ‌ర‌సలో కొంద‌రు నేత‌లు ఉన్నారు.. ఇప్పుడు క‌చ్చితంగా గెలుపు త‌థ్యం అని అనుకునే వారి కంటే, ముందు గెలుపు క‌ష్టంగా ఉండి, నియోజ‌క‌వ‌ర్గంలో మిశ్ర‌మ టాక్ ఉన్న నేత‌ల‌ను ఎంపిక చేసుకున్నారు అని తెలుస్తోంది.

Image result for tdp
అలాంటి నాయ‌కుల‌ను ఎమ్మెల్యే అభ్య‌ర్దులుగా పార్టీ చివ‌ర‌న ప్ర‌క‌టించేది.. కాని ఈ సారి ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి నుంచి రెడీ అవ‌డానికి వారికి కూడా ఇది తోడ్పాటు అందిస్తుంది అని భావించి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు అని తెలుస్తోంది.. ఇక పార్టీ నాయ‌కులు ఇప్ప‌టి నుంచే బాబు ద‌గ్గ‌ర త‌మ‌కు
అవ‌కాశం ఉందా లేదా అనే ఆలోచ‌న‌ని తెలియ‌చేస్తున్నారు అయితే ఇప్ప‌టికే ఓ స‌ర్వే టీం ప్ర‌కారం డ్యాష్ బోర్డు లెక్క‌ల ప్ర‌కారం ఓ 50 మంది పేర్లు తెలియ‌చేయ‌నున్నారు.

Related image

ఇక ప్ర‌కాశం జిల్లా కృష్ణ జిల్లాల నుంచి 15 మంది ఈ లిస్టులో ఉండ‌బోతున్నారు.. అలాగే తెలుగుదేశం పార్టీలో ఎప్ప‌టి నుంచో ఉండి .విజ‌య‌మే త‌ప్ప ఓట‌మి ఎరుగుని నాయ‌కుల‌కు కూడా ఈ సారి సీటు వారికే ఇవ్వాలి అని చూస్తున్నారు మ‌రి త్వ‌ర‌లో 20 నుంచి 25రోజుల్లో ఈ 50 మంది అభ్య‌ర్దుల పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తాయి అని అంటున్నారు. మ‌రి చూడాలి అందులో టికెట్ ఫిక్స్ అయ్యేవారు ఎవ‌రో.