టీడీపీ – బీజేపీ మ‌రో వార్ కు రెడీ

430

ఇటు బీజేపీ అటు తెలుగుదేశం నాయ‌కులు ఏపీలో రాజ‌కీయంగా ఎటువంటి విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారో తెలిసిందే.. ఇక వీరి విమ‌ర్శ‌ల‌కు మీడియాలు వేదిక‌లు అవుతున్నాయి.. ముఖ్య‌మంత్రి చంద్రబాబు పై బీజేపీ ఏపీ నేత‌లు ఫైర్ అవుతుంటే, ఇటు తెలుగుదేశం నేత‌లు మోదీ పై అలాగే బీజేపీ పై ఫైర్ అవుతున్నారు.

Image result for modi

ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష నేతలు జగన్, విజయసాయిరెడ్డి వాడే భాష అభ్యంతరకరంగా ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు. వైసీపీ నేతలు తమ భాషను నియంత్రించుకుని మాట్లాడాలని హితవుచెప్పారు.

Image result for modi chandrababu

ఇక వైసీపీకి కౌంట‌ర్ ఇచ్చిన కుటుంబ‌రావు, అలాగే బీజేపీ నాయ‌కులకు కూడా చుర‌క‌లు అంటించారు…బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు తీరుపై మండిపడ్డారు ఆయ‌న …. రాష్ట్రం పట్ల జీవీఎల్ శిఖండిలా వ్యవహరిస్తున్నారని ప‌లు ప‌రుష వ్యాఖ్య‌లు చేశారు. సాగరమాల ప్రాజెక్టు కింద కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా? అంటూ జీవీఎల్‌కు సవాల్ విసిరారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.

Image result for modi chandrababu

కాంగ్రెస్ హయాంలోనే అగ్రిగోల్డ్ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. కన్నా మంత్రిగా ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ పురోగతికి సాయం చేశారని కుటుంబ రావు చెప్పారు. దీనిపై అప్పట్లోనే తాను సెబీకి ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు కావాలనే తెలుగుదేశం నాయ‌కుల పై బుర‌ద చ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు అని ఆయ‌న విమ‌ర్శించారు. మొత్తానికి వీరి ఇద్ద‌రి వ్య‌వ‌హారం ఏపీ రాజ‌కీయాల్లో కాక‌పుట్టిస్తోంది..