40 మందితో మొద‌టి టీమ్ ప్ర‌క‌టించ‌నున్న బాబు

400

కొత్త బాధ్య‌త‌లు – కొత్త ప‌రిణామాలు పార్టీలో జ‌రుగుతాయ‌ట అది తెలుగుదేశం పార్టీలో.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్దుల పేర్లను ఈసారి ఎన్నిక‌ల‌కు ముందే ప్ర‌క‌టించాల‌ని భావిస్తున్నారు.. పార్టీ త‌ర‌పున 40 మంది అభ్య‌ర్దుల పేర్ల‌ను సెప్టెంబర్ నెలాఖ‌రున తెలియ‌చేస్తారట.. ఇప్పుడు ఇదే వైర‌ల్ అవుతున్న అంశం.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున అభ్య‌ర్దుల‌ను ప్ర‌క‌టించ‌నుంది .. సిట్టింగ్ ఎమ్మెల్యే స్ధానాలు కాకుండా వైసీపీ గెలిచిన స్ధానాల్లో తెలుగుదేశం అభ్య‌ర్దులు ఎవ‌రు అనేది ముందు ప్ర‌క‌టించాలి అని సీఎం చంద్ర‌బాబు ఆలోచిస్తున్నార‌ట.

Image result for chandrababu

దీనికి అధినేత ఆలోచ‌న‌కు వెంటనే మంత్రులు కూడా ఒకేచెప్పారు.. అయితే మంత్రులు కూడా కొంద‌రు త‌మ పేర్ల‌ను తెలియ‌చేస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీకి మ‌రింత ప్ల‌స్ అవుతుంది అని ఆలోచించి స‌ల‌హా ఇచ్చారు ఇందులో ఐదుగురికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారట సీఎం చంద్ర‌బాబు.. అయితే తెలుగుదేశం పార్టీ త‌ర‌పున మంత్రుల పేర్లు ముందు చెప్ప‌డానికి చంద్ర‌బాబు ఆలోచిస్తున్నారు అని తెలుస్తోంది…

Image result for chandrababu

వైసీపీ అధికారంలో ఉన్న సెగ్మెంట్ల‌లో పోటీ చేసే అభ్య‌ర్దుల పేర్ల‌ను ముందు ప్ర‌క‌టిస్తారు… అక్క‌డ నుంచి మంత్రి పేర్లు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌లో ఎవ‌రు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారు అని తెలియ‌చేస్తారు వారి పేర్లు అప్పుడు ప్ర‌క‌టిస్తారు….. ఇది తెలుగుదేశం ఆలోచ‌న ఇలా చేయ‌డం వల్ల పార్టీలో ఎవ‌రు చేరుతారు ఎవ‌రు రారు ఎవ‌రు పార్టీ మార‌తారు అనేది ఎన్నిక‌ల‌కు మూడు నెల‌ల ముందే తెలుస్తుంది.. అయితే ఇలా ఇనిషియేటివ్ గా ఎవ‌రు తీసుకున్నా ఆ రెండు పార్టీలకు మంచిదే …ఇందులో ముంచే నాయకుడు ఎవ‌రు, మునిగే నాయ‌కులు ఎవ‌రు, ముంచాలని భావిస్తున్న‌నాయ‌కులు ఎవ‌రు అనేది తెలుస్తుంది.