కూకట్ పల్లి రోడ్ షో లో చంద్రబాబు Jr.ఎన్టీఆర్ గురించి మాట్లాడుతుంటే సుహాసిని ఏం చేసిందో చూడండి

458

శనివారం (డిసెంబర్ 1) రాత్రి కూకట్‌పల్లిలో ప్రజాకూటమి తరఫున టీడీపీ నుంచి బరిలోకి దిగిన నందమూరి సుహాసినికి మద్దతుగా చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. భారీగా తరలివచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణుల కేరింతల మధ్య చంద్రబాబు ప్రసంగిస్తూ.. కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు. సుహాసినిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అయితే ఈ సందర్భంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి చంద్రబాబు మాట్లాడాడు.అయితే ఆ సమయంలో నందమూరి సుహాసిని చేసిన ఒక పనికి టీడీపీ వర్గాలు షాక్ అయ్యాయి. మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా..

Image result for chandrababu roadshow

కూకట్ పల్లి రోడ్డు షోలో చంద్రబాబు మాట్లాడుతూ..ఇది (హైదరాబాద్) నేను నచ్చిన నగరం. ప్రపంచమంతా తిరిగి దీన్ని అభివృద్ధి చేశా. ఫైల్స్ చేతులో పట్టుకొని మోశా. నాలుగేళ్ల పాలనలో కేసీఆర్ ఒక్క ఫ్లై ఓవర్ అయినా కట్టాడా?’ అని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌ను చంద్రబాబే కట్టారట అంటూ తనపై విమర్శలు చేస్తున్నారని, తాను హైదరాబాద్ కట్టలేదని.. సైబరాబాద్‌ను నిర్మించానని స్పష్టం చేశారు.తెలంగాణలో పెత్తనం చేయడానికి తాను రాలేదని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో మంచి ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. తన కృషి వల్లే హైదరాబాద్‌ దేశంలోనే అత్యుత్తమ నగరంగా ఎదిగిందన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు రెండుసార్లు ప్రధాని పదవిని వదులుకున్నానని చెప్పారు. తాను తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడలేదని, తెలంగాణలో తన హయాంలో భీమ, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతలను ప్రారంభించానన్నారు.

 

ఇలా సాగిపోతున్న చంద్రబాబు ప్రసంగంలో ఎన్టీఆర్ పేరు వచ్చింది.మీరందరు సుహాసినిని గెలిపించాలి.అక్క కోసం ఎన్టీఆర్ కూడా రేపో లేదా ఎల్లుండి రోడ్డు షో చేస్తాడని చంద్రబాబు అన్నాడు.అయితే ఆ సమయంలో సుహాసిని కొంచెం డిస్సపాయింట్ అయినట్టు తెలుస్తుంది.ఎందుకంటే ఎన్టీఆర్ ప్రచారానికి రావడం లేదు.షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు.అందుకే ఎన్టీఆర్ రావడం లేదు.అందుకే సుహాసిని ఎన్టీఆర్ మీద కోపంతో ఉన్నాడంట.తారకరత్న ప్రచారం చేసిన కానీ కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఇంతవరకు ప్రచారానికి రాకపోవడం గురించి సుహాసిని తనలో తాను మదనపడుతుందంట. అందుకే చంద్రబాబు ఎన్టీఆర్ గురించి మాట్లాడినప్పుడు సుహాసిని మోహంలో కాస్త కోపం కనిపించింది.చూడాలి మరి ప్రచారానికి ఇంకో రెండు రోజులు ఉంది.ఈ రెండు రోజుల్లో సోదరి కోసం వస్తారో రారో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.సోదరుల మీద సుహాసిని కోపంగా ఉండటం గురించి అలాగే కూకట్ పల్లిలో సుహాసిని గెలుస్తుందని అనుకుంటున్నారా. మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.