పొగిడిన నోరే నేడు విమ‌ర్శిస్తోంది

253

రాజ‌కీయాలు ఎప్పుడైనా ఎవ‌రిని అయినా ఎలాగైనా మారుస్తాయి.. ఇటీవ‌ల బీజేపీలో చేరిన స్వామి ప‌రిపూర్ణానంద పూర్తిగా రాజ‌కీయ నేత‌గా మారిపోయారు. ఇక గ‌తంలో కేసీఆర్ ని ప్ర‌శంసించిన ఆయన నేడు ఆయ‌న పై విమ‌ర్శ‌లు చేశారు పార్టీ మీటింగులో…తెలంగాణలో నిజాం పాలన పోయినా సీఎం కేసీఆర్‌ 8వ నిజాంగా పాలన కొనసాగిస్తున్నారని శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద అన్నారు.

Image result for kcr

ఇక కేసీఆర్‌ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని, డిసెంబరు 12తో కేసీఆర్‌ పీడ విరగడై తెలంగాణ ప్రజలకు విముక్తి లభిస్తుందని చెప్పారు. హైదరాబాద్‌ శివారు ఫీర్జాదిగూడలో మేడ్చల్‌ బీజేపీ అభ్యర్థి కొంపల్లి మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మేడ్చల్‌ నియోజకవర్గ బూత్‌స్థాయి కార్యకర్తల సభకు స్వామి పరిపూర్ణానంద ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్‌ తన కుటుంబ సంక్షేమాన్ని తప్ప ప్రజల సంక్షేమాన్ని మరిచారని, కమీషన్ల కోసమే ప్రాజెక్టులు నిర్మిస్తూ అడ్డగోలుగా దండుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. మ‌రి అదండి విష‌యం.