జగన్ పవన్ ను కలుపుతాడట…!

496

తెలంగాణ తెలుగుదేశం బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు మరోసారి చంద్రబాబు నాయుడు పై తీవ్ర విమర్శలు గుప్పించారు..గడిచిన మూడు నెలలుగా రాజకీయాలు మాట్లాడలేదన్న ఆయన తన లక్ష్యం గురించి మాత్రమే పనిచేస్తున్నట్టు చెప్పారు..దళితుడైన తనను పార్టీ నుంచి బహిష్కరించారని ఆయన ఆవేదనతో చెప్పారు…15 ఏళ్ళు చంద్రబాబు దగ్గర తెలుగుదేశం పార్టీలో కుక్కలా పని చేసానని, తరువాతి కాలంలో తనను వాడుకొని వదిలేసారని ఆయన వాపోయారు..దీనికి తగిన మూల్యం చంద్రబాబు చెల్లించుకుంటారని ఆయన అన్నారు..తనకు మంత్రి పదవి ఇస్తానని మొదట ఆ తరువాత గవర్నర్ గిరి కట్టబెడతానని చెప్పిన చంద్రబాబు చివరకు ఏ పదవి లేకుండా రోడ్డున పడేసారన్నారు…

చంద్రబాబును రోడ్డు మీద పడేసేందుకు అంతా ఏకమవ్వాలన్నారు. బాబు ఒక చీడపురుగుగా అభివర్ణించిన మోత్కుపల్లి.. బాబును ఓడించేందుకు జగన్.. పవన్.. కిరణ్ కుమార్ రెడ్డిలు కలవాలన్నారు. ఏ తప్పు చేయని తన గొంతు కోసి చంద్రబాబు అందుకు తగిన మూల్యం చెల్లించాలన్నారు. తాను ఏ పార్టీలో చేరాలనే విషయం మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ఆయన.. తనను బాబు బాగా వాడుకున్నారన్నారు. తాను ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయించుకోలేదని.. తన గౌరవాన్ని కాపాడే పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. తనను ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఆదరించిన ఆలేరు ప్రజల నుంచి ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మాల.. మాదిగలంటే చిన్నచూపు చూసే చంద్రబాబుకు చుక్కలు చూపించాలన్న తన అభిమతంగా చెప్పారు. పవన్ కు ఒక మిత్రుడిలా సాయం చేయాలనుకున్నట్లు చెప్పిన మోత్కుపల్లి.. జగన్ కు కూడా మిత్రుడిగా తనకు తోచిన సాయం చేస్తానని చెప్పారు. తాను తిరుపతికి వెళ్లినప్పుడు జగన్.. పవన్ మనుషులు తన కోసం వచ్చినట్లుగా చెప్పారు.