స‌ర్వేల ల‌గ‌డ‌పాటి క్లారిటీ

608

మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ మ‌ళ్లీ క్రియాశీల‌క రాజ‌కీయాల్లోకి వ‌స్తారా అనే ప్ర‌శ్న ఇప్పుడు అంద‌రిని తొలిచివేస్తోంది.. ముఖ్యంగా విజ‌య‌వాడ వారిని ఇది మ‌రింత తొలుస్తున్న‌ప్ర‌శ్న.. ఆయ‌న జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేయ‌రు, బాబుని ఒక్క‌మాట అన‌రు.. దీంతో ఏ పార్టీలో ఆయ‌న చేరుతారు అని చ‌ర్చించుకుంటున్నారు… అయితే కాంగ్రెస్ గూటికి చేరినా మ‌ళ్లీ ఆయ‌న‌కు గ‌త వైభ‌వం వ‌స్తుంది అని చెప్ప‌లేము, దీంతో ఆయ‌న ఇప్పుడు పొలిటిక‌ల్ గా ఎటువంటి స్టెప్ తీసుకుంటారు అని తెలియడం లేదు.

Image result for lagadapati rajagopal

ఇక తెలుగుదేశం పార్టీ నాయ‌కులు వైసీపీ నాయ‌కులు కూడా ఆయ‌న తో ట‌చ్ లో ఉంటున్నారు… ఇక ఆయ‌న తాజాగా స‌ర్వే ల గురించి ఎప్పుడూ వార్త‌ల్లో ఉంటున్నారు..తాజాగా ఆయ‌న ఏపీకి ప్ర‌త్యేకహూదా ఇవ్వాలి అని ఇది ప్ర‌జ‌ల ఆకాంక్ష అని తెలియ‌చేశారు.. ఇక సర్వేల గురించి ఆయ‌న్ని అడిగిన మీడియాకు స‌మాధానం చెప్పారు ఆయ‌న‌. అలాగే ఎన్నికల్లో పోటీ ఏపార్టీలో చేరుతారు అనే విష‌యాల‌పై క్లారిటీ ఇచ్చారు ఆయ‌న‌.

Image result for lagadapati rajagopal

ప్రాణ త్యాగాలు, ఆత్మ బలిదానాలతో ప్రత్యేకహోదా రాదని.. పోరాటాల ద్వారానే ప్రత్యేకహోదా సాధ్యమన్నారు. ఎవ‌రూ తొంద‌ర‌ప‌డ‌వ‌ద్దు అన్నారు ఆయ‌న‌. ఏపీకి ప్ర‌త్యేక హూదా వ‌స్తే ఉద్యోగాలు వ‌స్తాయి అని అన్నారు ఆయ‌న‌… ఇక ఇదే విష‌యాన్నితాను బలంగా న‌మ్ముతున్నాను అని అన్నారు..రాష్ట్రాన్ని విభజించినందుకే ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి బుద్ధి చెప్పారని, ప్రత్యేకహోదా ఇవ్వకపోతే రానున్న ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి అదే గతి పడుతుందన్నారు…. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని.. ఎన్నికల సర్వే వివరాలు ఎన్నికలకు ముందుగా విడుదల చేస్తానని చెప్పారు ల‌గ‌డ‌పాటి.