టీడీపీలో స‌ర్వే ఎఫెక్ట్ అందుకే జంపింగ్

502

తెలుగుదేశం పార్టీనుంచి జ‌న‌సేన‌లో చేరాలా లేదా వైసీపీలో చేరాలా అనే ఆలోచ‌న చేస్తున్నారు కొంద‌రునాయ‌కులు.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది.. ఇప్పుడు ప్ర‌జ‌లు కూడ కాస్త అధికార పార్టీ పై రుస‌రుస‌ల‌తో ఘ‌రం ఘ‌రంగా ఉన్నారు.. గ‌త ఎన్నిక‌ల హ‌మీలు అలాగే కాపు రిజ‌ర్వేష‌న్ అంశం ఏపీలో అధికార పార్టీకి కాస్త ఇబ్బంది పెడుతున్నఅంశం.. అయితే అధికార పార్టీకి ఎక్క‌డ ఉన్నా ఇటువంటి ప‌రిస్దితి కనిపిస్తుంది మ‌రి ప్ర‌తిప‌క్ష పార్టీ ఎక్క‌డ ఉన్నా ఫాలోయింగ్ ఉంటుంది… పైగాసిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎక్కువ సంఖ్య‌లో అధికార తెలుగుదేశంలో ఉన్నారు.

Image result for tdp vs ycp flag

దీంతో ఆ పార్టీలో చేరినా మాజీల‌కు టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉండ‌దు.. అందుకే వేరే పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలోకి నాయ‌కులు చేరిక‌లు ఉండ‌టం లేదు.. అలాగే తెలుగుదేశం నుంచి వైసీపీలోకి చేరిక‌లు జ‌రుగుతున్నాయి అన‌డానికి ప్ర‌ధాన కార‌ణం? తెలుగుదేశం పార్టీ నుంచి ఎవ‌రు నిల‌బ‌డాలి అన్నా చంద్ర‌బాబు కేవ‌లం స‌ర్వేల‌తోనే వారికి టికెట్ ఇస్తారు.. దీంతో స‌ర్వేలో పాస్ అయిన వారికి మాత్ర‌మే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు.. అందుకే తెలుగుదేశం నుంచి స‌ర్వేలో ఫెయిల్ అయిన నాయ‌కులు తెలుగుదేశం నుంచి వైసీపీ వైపు చూస్తున్నారు.. ఇక అధికార పార్టీ నుంచి నాయ‌కులు రావ‌డంతో జ‌గ‌న్ కూడా సీటు హామీ ఇస్తూ తీసుకుంటున్నారు.

Image result for tdp vs ycp flag

కాని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్ప‌టికే తెలుగుదేశం త‌ర‌పున గ‌ట్టి పోటి ఉంటుంది.. ఎందుకు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు పైగా అధికారానికి ప‌ది సంవ‌త్స‌రాల నుంచి దూరంగా ఉండి.. అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌భుత్వం.. అందుకే తెలుగుదేశం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్దికి ప్ర‌ణాళిక ర‌చించింది.. కేంద్ర గ్రాంటుల‌తో ప‌ల్లెల్లో రోడ్లు డ్రైయిన్ లు వేయించింది.. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా నెర‌వ‌రని ప‌నుల‌కు మోక్షం వ‌చ్చింది అని ప్ర‌జ‌లు, టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నారు… ఇక స‌ర్వే ఎఫెక్ట్ మాత్ర‌మే తెలుగుదేశం నుంచి నేత‌లు బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి ప్ర‌ధాన కార‌ణం అని చెబుతున్నారు నేత‌లు.