కరుణానిధికి కుమారుడు స్టాలిన్ రాసిన లేఖ చ‌దివితే కన్నీరు రాక‌మాన‌దు

549

త‌మిళ సూరీడు అన్న‌ప‌క్క‌న అస్త‌మించారు.. కరుణ లేరు అన్న మాటని కూడా పార్టీ ప్ర‌జ‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు ఇక ఆయ‌న కుటుంబ స‌భ్యులు కూడా ఏమాత్రం కోలుకోలేక‌పోతున్నారు..తన తండ్రి కరుణానిధి మరణాన్ని ఆయన రెండో కుమారుడు ఎంకే స్టాలిన్ జీర్ణించుకోలేక పోతున్నారు. పార్టీ అధినేతగా కరుణానిధి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా స్టాలిన్ ముందుండి పార్టీని నడిపిస్తూ వచ్చారు. ఈ క్రమంలో గత యేడాదిన్నర కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన కరుణానిధి క‌న్నుమూయ‌డంతో పెద్దిదిక్కుని కోల్పోయారు ఆ ఫ్యామిలీ.

Image result for M. K. Stalinఆ తర్వాత స్టాలిన్ తన స్వదస్తూరితో కార్యకర్తల కోసం ఓ లేఖ రాశారు. ఈ లేఖ ప్రతి ఒక్కరిని గుండెలు పిండేసేలావుంది. కంట కన్నీరు తెప్పిస్తోంది. కరుడుగట్టిన తమిళ రాజకీయవాది, ద్రవిడ ఉద్యమకారుడిగా పేరుగాంచిన కరుణానిధిని గుర్తుచేసుకుంటూ కుమారుడు స్టాలిన్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా రాసిన లేఖలో తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

Image result for M. K. Stalinఇంతకాలం మిమ్మల్ని అప్పా (నాన్నా) అని కాకుండా తలైవరే (అధ్యక్షా) అనే ఎక్కువసార్లు పిలిచాను. చివరిసారిగా ఒక్కసారి మిమ్మల్ని అప్పా (నాన్నా) అని పిలవచ్చా తలైవరే. తమిళ రాష్ట్ర సంక్షేమం కోసం మీరు చేసిన సేవ పూర్తైందనుకుని వెళ్లిపోయారా నాన్నా.. మీరు ఎక్కడికి వెళ్లినా నాకు చెప్పకుండా వెళ్లేవారు కాదు. కానీ ఈ సారి ఎందుకు చెప్పకుండా వెళ్లిపోయారు? ఒక్కసారి నా ప్రియమైన సోదరులారా.. అని మమ్మల్ని పిలవండి. ఆ పలుకే మరో శతాబ్దం వరకు కలిసి పోరాడేందుకు మాకు శక్తినిస్తాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

80 ఏళ్లుగా మీరు తమిళనాడు కోసం చేసిన సేవలు, సాధించిన రికార్డులు మీకే సాధ్యం. జూన్‌ 3న మీ పుట్టినరోజు, మీకున్న నైపుణ్యాలలో సగం వంతు నాకు ఇవ్వండి అని ఒకసారి మిమ్మల్ని వేడుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మీ గురువు అన్నాదురై వెళ్లిపోతూ ఆయన హృదయాన్ని మీకు ఇచ్చినట్లే.. మీ హృదయం నాకు ఇస్తారా? ఎందుకంటే మీరు కన్న కలలు మేం పూర్తి చేస్తాం. అంటూ భావోద్వేగంతో స్టాలిన్ లేఖలో తెలిపారు.. మొత్తానికి తండ్రి మ‌ర‌ణంతో ఇటు పెద్ద కుమారుడు అళ‌గిరి స్టాలిన్ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌వ‌డం అక్క‌డ చూసిన వారిని కూడా క‌లిచివేసింది వారు ఇద్ద‌రూ క‌న్నీరుపెట్టుకుంటూనే ఉన్నారు కుమార్తె క‌నిమెళి కూడా సోద‌రుల ద‌గ్గ‌రే ఉంటూ క‌న్నీరుపెట్టుకున్నారు.. త‌మిళ త‌లైవ‌రే లేని లోటు ఇటు ఎవ‌రూ తీర్చ‌లేనిది.