శ్రీనివాస‌రావు రిమాండ్ లో చెప్పిన విష‌యాలు విని షాకైన జ‌గ‌న్ కుటుంబ స‌భ్యులు

410

వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పై జ‌రిగిన దాడిని, ఇప్పుడు యావ‌త్ తెలుగు ప్ర‌జ‌లు ఎటువంటి విచారణ వార్త వ‌స్తుందా అని ఆలోచిస్తున్నారు. సంచలనం కోసమే నిందితుడితో డ్రామా నడిపించారని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేసిన పోలీసులు..చివరకు అది హత్యాయత్నమేనని అంగీకరించక తప్పలేదు… ప్రతిపక్ష నేతకు అదృష్టవశాత్తూ ముప్పు తప్పిందని, కత్తి పోటు గొంతులో దిగి ఉంటే ప్రాణాలు దక్కేవి కావని కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు… కుట్ర కోణంపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని నగర పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌చంద్ర లడ్డా మీడియాతో చెప్పారు.

Image result for jagan family

ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై గత గురువారం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన కత్తి దాడి హత్యాయత్నమే. వైఎస్‌ జగన్‌ అదృష్టవశ్తాతూ యాధృచ్ఛికంగా పక్కకు తిరగడంతో ప్రాణానికి ముప్పు తప్పింది. ఆ కత్తిపోటు గొంతులో దిగి ఉంటే ప్రాణాలు దక్కేవి కావు. దుండగుడు శ్రీనివాసరావు వైఎస్‌ జగన్‌ను హతమార్చాలనే దాడి చేశాడు. ఎడమ చేతి భుజంపై కత్తి దింపి… వెనక్కి తీసి మరోసారి పొడిచేందుకు యత్నించగా.. పక్కనే ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలు బలవంతంగా అతని నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

Image result for jagan

ఇంకా రిమాండ్‌ రిపోర్ట్‌లో విభ్రాంతికరమైన విషయాలు మరెన్నో ఉన్నాయి. కోర్టు అనుమతితో నిందితుడు శ్రీనివాసరావును పోలీస్‌ కస్టడీకి తరలించారు. సీపీ మహేష్‌చంద్ర లడ్డా, సిట్‌ ఇన్‌చార్జి నాగేశ్వరరావులు అతనితో పాటు మొత్తం 12మందిని విచారించారు. నిందితుడు దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరించడం లేదని, ఏమి అడిగినా లేఖలో అంతా పేర్కొన్నాను.. చదువుకోమని చెబుతున్నాడని తెలుస్తోంది. నిందితుడి నుంచి4 సెల్‌ఫోన్లు స్వాధీనంచేసుకున్నారు. అతని బ్యాంకు లావాదేవీలపై విచారణ కొనసాగిస్తున్నారు.

Related image

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎయిర్‌పోర్టు వీఐపీలాంజ్‌లో జరిగిన హత్యాయత్నం, కేసు విచారణ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో సాగుతోంది. ఈ కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును ఆరు రోజుల పోలీస్‌ కస్టడీకి అప్పగించడంతో స్టేషన్‌ పరిసరాల్లో ఎప్పుడు లేనంత హడావుడి కనిపించింది. కేంద్ర కారాగారం నుంచి నిందితుడిని తీసుకువస్తున్న సమయంలో స్టేషన్‌ వద్ద పోలీసులతో పహారా కాశారు. మరో వైపు విచారణకు వేదికైన స్టేషన్‌కు అన్ని ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు చానల్స్‌ లైవ్‌ వెహికల్స్‌తో తరలి వచ్చారు. అలాగే ప్రింట్‌ మీడియా ప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున చేరుకోవడంతో స్టేషన్‌ పరిసరాలు నిండిపోయాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

శ్రీనివాసరావు సహచర సిబ్బంది రమాదేవి, స్నేహితుడు రేవతిపతి, ఫ్లెక్సీ ఓనర్‌ చైతన్య తదితరులతో కలిసి విచారణ ప్రారంభించారు. మధ్యాహ్నం వరకు నిందితునిపై ప్రశ్నల పరంపర కొనసాగింది. అన్నింటికి ఒక్కటే మందు అన్నట్టుగా నేను చెప్పాల్సింది ఆ లేఖలోనే ఉందంటూ విచారణలో నిందితుడు పదే పదే చెప్పడంతో అధికారులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఒకరి తర్వాత ఒకరిగా అతని స్నేహితులను కూడా స్టేషన్‌కు రప్పించి విచారణ సాగించారు. దీంతో స్టేషన్‌కు వస్తున్న వారిలో ఎవరు నిందితులో.. ఎవరు సాక్షులో తెలియక మీడియా ఒకింత అయోమయానికి గురైంది.