ఎంపీ గల్లా జ‌య‌దేవ్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి షాకింగ్ పోస్టు

775

పార్ల‌మెంట్లో అవిశ్వాస తీర్మానం పై చ‌ర్చ జ‌రిగింది.. ఓటింగ్ ముగిసింది.. అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.. అయితే అక్క‌డ జ‌రిగిన ప్ర‌సంగాలు మాత్రం ఇప్పుడు అంద‌రి నోటా వినిపిస్తూనే ఉన్నాయి.లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గళమెత్తిన సంగతి అంద‌రికీ తెలిసిందే.. కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీ నెర‌వేర్చ‌లేద‌ని అన్నారు.. అంతేకాదు ఇచ్చిన హ‌మీని నెర‌వేర్చ‌ని కార‌ణంగా ఆయ‌న ఓ సినిమా కోట్ కూడా అక్క‌డ తెలియ‌చేశారు.

Image result for galla jayadev

భరత్ అనే నేను సినిమాను కూడా ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఈయన ప్రసంగిస్తున్నంత సేపూ టీడీపీ ఎంపీలతో పాటు మిగతా పార్టీకి చెందిన ఎంపీలు ఆయన వైపే చూశారు.. ఇక ఆయ‌న చేసిన ప్ర‌సంగం పై స‌భ్యులు అంద‌రూ షాక్ అయ్యారు..

Image result for sree reddy

ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ పార్ల‌మెంట్లో ఇచ్చిన స్పీచ్ పై న‌టి క్యాస్టింగ్ కౌచ్ అంశం వెలుగులోకి తీసుకువ‌చ్చిన శ్రీరెడ్డి… కూడా మాట్టాడారు… గల్లా గారు.. పార్లమెంట్‌లో మీ ప్రసంగం అదుర్స్ సార్.. ఆంధ్రప్రదేశ్ గర్విస్తోంది. మీరు మాట్లాడుతుంటే ప్రత్యర్థి పార్టీ సభ్యుల ముఖాల్లో నెత్తుటి చుక్క కూడా లేదు.. థ్యాంక్యూ సార్… గ్రేట్ లీడర్ అని శ్రీరెడ్డి తన ఫేస్‌‌బుక్‌లో పోస్ట్ చేసింది…దీంతో పాటు గల్లా జయదేవ్ ప్రసంగిస్తున్నట్లు  ఉన్న ఓ ఫొటోను కూడా శ్రీరెడ్డి పోస్ట్ చేసింది.. మొత్తానికి
ఇటు అంద‌రి ప్ర‌శంస‌లు గ‌ల్లా అందుకున్నారు పార్ల‌మెంట్ స్పీచ్ తో .