కోడెల సూసైడ్ నోట్..? షాకింగ్ నిజాలు

1291

ఏపీ మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ మృతితో తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ శ్రేణులు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు. టీడీపీలోనే ఆయ‌న మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కూ ఉన్నార‌ని అలాంటి గొప్ప వ్య‌క్తి ఇలా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం జీర్ణించుకోలేక‌పోతున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ఇది క‌చ్చితంగా ప్ర‌భుత్వం క‌క్ష‌పూరింత‌గా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్లే జ‌రిగిన ఆత్మ‌హ‌త్య‌గా చెబుతున్నారు తెలుగుదేశం నాయ‌కులు. సీనియ‌ర్ నాయ‌కుడు అని కూడా చూడ‌కుండి ఇలా కేసుల‌తో అవ‌మానించారు అని అందుకే ఆయ‌న ఆత్మాభిమానంతో ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు అనేది తెలుగుదేశం చేస్తున్న విమ‌ర్శ‌.. అయితే ఆయ‌న చ‌నిపోయే ముందు నిజంగా ఇలా కేసుల గురించి లేదా మ‌రేవైనా గొడ‌వ‌ల గురించి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారా అని పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.

Image result for kodela siva prasad

కోడెల అనుమానాస్పద స్థితిలో మరణించినట్టుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. కోడెల ఇంట్లో – ఆయన ఆత్మహత్య చేసుకున్న రూమ్ పోలీసుల పర్యవేక్షణలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు ప్రకటించారు. కోడెల కుటుంబీకులు కూడా ఆయన ఎలాంటి లేఖా రాయలేదని పేర్కొన్నారు.దీంతో కోడెల ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదని స్పష్టం అవుతోంది. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ వాళ్లు ఆయన మరణాన్ని రాజకీయం చేయాలని చూస్తున్న వైనాన్ని ప్రస్తావించవచ్చని పరిశీలకులు అంటున్నారు. ఒకవేళ కోడెల ప్రభుత్వ వేధింపులతో ఆత్మహత్య చేసుకుని ఉంటే ఆ విషయాన్ని కచ్చితంగా ప్రస్తావించే వారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఈ క్రింద వీడియో చూడండి

ప్రభుత్వం తనను వేధిస్తోందని – వాటిని తాళలేక చనిపోతున్నట్టుగా అయితే.. కోడెల ఆ విషయాన్ని కచ్చితంగా ప్రస్తావించేవారంటున్నారు. అయితే కోడెల ఎలాంటి లేఖనూ రాయలేదని ధ్రువీకరణ అవుతోంది. ఆయన వ్యక్తిగత కారణాలు – అందుకు సంబంధించిన ఇబ్బందులతో తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకుని ఉండవచ్చు. అందుకే ఎలాంటి లేఖనూ రాయలేదని పరిశీలకులు అంటున్నారు. అయినా తెలుగుదేశం నేతలు – చంద్రబాబు నాయుడు రాజకీయం కోసం ఆయన మరణాన్ని ఉపయోగించుకుంటున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ స‌మ‌యంలోనే మరో వార్త వినిపిస్తోంది ఆయ‌న సూసైడ్ నోట్ రాసి ఉంటార‌ని అది ఇంకా భ‌య‌ట‌ప‌డి ఉండ‌క‌పోవ‌చ్చు అని చెబుతున్నారు కాని పోలీసులు మాత్రం అలాంటిది ఏమీ లేదు అంటున్నారు.సోష‌ల్ మీడియాలో మాత్రం ఓ సూసైడ్ నోట్ వైర‌ల్ అవుతోంది, ప్ర‌భుత్వం క‌క్ష‌సాధింపు వ‌ల్ల ఇలా చేసుకుంటున్న‌ట్లు రాసిన లేఖ.. అయితే ఇది ఫేక్ అని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ఫేక్ లెట‌ర్లు వైర‌ల్ చేస్తే జైలు త‌ప్ప‌దు అంటున్నారు. మ‌రి చూడాలి కోడెల కేసు పై విచార‌ణ ఎలా సాగుతుందో.