అసెంబ్లీ వ‌ద్ద భారీగా పోలీసుల మొహ‌రింపు: ఎప్పుడూ లేని విధంగా: అమ‌రావ‌తిలో ఏం జ‌రుగుతోంది…!

143

ఏపీలో ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత తొలిసారి 144 సెక్ష‌న్ విధించారు. ఏపీ అసెంబ్లీ వ‌ద్ద భారీ భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేసారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లోకి వ‌స్తున్న ప్ర‌తీ ఒక్క‌రినీ త‌నిఖీ చేస్తున్నారు. గుర్తింపు కార్డు లేని వారిని అనుమ‌తించ‌ట లేదు. ఈ రోజు శాస‌న‌స‌భ‌లో ప్ర‌వేశాల పైన ఆంక్ష‌లు విధించారు. ఇదే స‌మ‌యంలో ఈ రోజుతో ఏపీ శాస‌న‌స‌భా బ‌డ్జెట్ స‌మావేశాలు ముగియ‌నున్నాయి. స‌భ‌లో కాగ్ నివేదిక ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. అసెంబ్లీ వ‌ద్ద ఇంత భారీ స్థాయిలో బ‌ల‌గాల మొహ‌రింపు వెనుక అస‌లు కార‌ణం ఏంటంటే..

Image result for ap assembly crowd

నేడు ఏపీ అసెంబ్లీ ముట్టడికి MRPFS పిలుపునిచ్చింది. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమన్న సీఎం జగన్‌ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేయనున్నారు. జగన్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఎమ్మార్పీఎస్‌ డిమాండ్‌. ఎమ్మార్పీఎస్‌ నేతలు నిరసన నేపథ్యంలో అసెంబ్లీ, రాజధాని ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్‌ అమలు చేశారు. ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మార్పీఎస్‌ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. వారిని తుళ్లూరు, వెంకటపాలెం, ఉద్దండరాయుడిపాలెంలో గృహ నిర్బంధంలో ఉంచారు. అయితే గతంలో ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు రాజధాని ప్రాంతంలో నిర్వహించ తలపెట్టిన కురుక్షేత్ర సభను భగ్నం చేసేందుకు పోలీసులు యత్నించగా పోలీస్‌ జీపు దహనంతో పాటు పలు దారుణ చర్యలకు పాల్పడిన నేపథ్యంలో మంగళవారం నాటి అసెంబ్లీ ముట్టడిలో కూడా ఇదే తరహా ఘటన రిపీట్ అవుతాయని పోలీస్‌ వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో రాజధాని ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అర్బన్‌, రూరల్‌ జిల్లా పరిధిలో అసెంబ్లీకి వెళ్లే అన్ని దారుల్లోనూ సిబ్బందిని భారీగా మోహరించారు.

ఈ క్రింద వీడియో చూడండి

కొద్ది రోజులుగా ఏపీలో మంద కృష్ణ మాదిగ ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణకు మ‌ద్దుగా అనేక వ్యాఖ్య‌లు చేసారు. గ‌తంలో చంద్ర‌బాబు వ్య‌వహ‌రించిన విధంగానే ఇప్పుడు జ‌గ‌న్ తీరు ఉందంటూ ఆరోపిస్తున్నారు. మంద కృష్ణ మాదిగ ఛ‌లో అసెంబ్లీ పిలుపు కు వ్య‌తిరేకంగా అనేక మంది ఇత‌ర నేత‌లు వ్యాఖ్య‌లు చేసారు. అయితే, పోలీసు అధికారులు మాత్రం ఎవ‌రైనా అసెంబ్లీ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఆటంకాలు సృష్టించాల‌ని ప్ర‌య‌త్నిస్తే స‌హించేది లేద‌ని స్ప‌ష్టం చేసారు. దీంతో.. అసెంబ్లీ ప‌రిస‌ర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బ‌ల‌గాల‌ను మొహ‌రించారు. ఏపీ శాస‌న‌స‌భా అసెంబ్లీ స‌మావేశాలు ఈ రోజుతో ముగుస్తున్నాయి. గ‌త నెల 11వ తేదీన ప్రారంభించిన ఈ స‌మావేశాల్లో 12వ తేదీన బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టారు. ఇప్ప‌టికే ద్ర‌వ్య వినిమ‌య బిల్లును సైతం స‌భ ఆమోదించింది. దీంతో.. ఈ రోజు ప్రశ్నోత్తరాలకు ఎక్కువ సమయం కేటాయించనున్నారు. ముఖ్యంగా అన్న క్యాంటీన్‌ల మూసివేత, నిరుద్యోగ భృతి, విజయవాడ నుంచి విమాన సర్వీసుల నిలిపివేత, అమరావతిలో మంత్రులు, అధికారుల క్వార్టర్ల నిర్మాణం పురోగతిపై టీడీపీ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తనున్నారు. మరోవైపు ఫైబర్‌గ్రిడ్‌లో అక్రమాలు, ఖరీఫ్‌లో విత్తనాల కొరత, వైద్య కళాశాలల్లో ఫీజులు, వ్యవసాయ రుణాలమాఫీపై వైసీపీ సభ్యుల ప్రశ్నలు లేవనెత్తనున్నారు. దీంతో పాటుగా 2017-18 కాలానికి సంబంధించిన కాగ్ నివేదిక‌ను స‌భ‌లో ఆర్దిక మంత్రి బుగ్గ‌న ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. చూడాలి మరి ఈరోజు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయో..