టీడీపీ అవిశ్వాసానికి స్పీక‌ర్ మ‌ద్ద‌తు

372

ఏపీకి ప్ర‌త్యేక హూదా అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల‌ను షేక్ చేస్తోంది.. ముఖ్యంగా విభ‌జ‌న హామీలు తీర్చ‌డంలో బీజేపీ ఏపీకి అన్యాయం చేసింది అని, ఏపీకి ప్ర‌త్యేక హూదా ఇవ్వ‌డంలో వెన‌కడుగు వేశారు అని బీజేపీ పై విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు.. ఇటు ఏపీకి ప్ర‌త్యేక హూదా కోసం వైసీపీ ఎంపీలు ఐదుగురు ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేశారు.. ఇక నేడు పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం అయ్యాయి, దీంతో తెలుగుదేశం మ‌రోసారి అవిశ్వాస అస్త్రం వ‌దిలింది కేంద్రం పై ..

Image result for సుమిత్రా మహాజన్‌

విభజన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ స్వీకరించారు. ఈ అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్‌ పార్టీ మద్దతు తెలిపింది. ఈ తీర్మానాన్ని స్పీకర్‌ సభలో చదవి వినిపిస్తుండగా.. టీడీపీ నేతలు, కాంగ్రెస్‌ పార్టీ నేతలు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలు లేచి నిలబడి మద్దతు తెలిపారు. అవిశ్వాసానికి 50 మంది స‌భ్యులు మ‌ద్ద‌తు రావ‌డంతో హౌస్ లో ఈ తీర్మాణం ముందుకు క‌దిలింది… అవిశ్వాస తీర్మాణం పై స్పీక‌ర్ దీనిని పరిగ‌ణ‌లోకి తీసుకున్న‌ట్లు తెలియ‌చేశారు.
అయితే టీఆర్‌ఎస్‌ పార్టీ దీనికి మద్దతు ఇవ్వ‌లేదు.

Image result for సుమిత్రా మహాజన్‌

పార్లమెంట్‌ నిబంధనల ప్రకారం 10 రోజుల్లోగా చర్చకు అనుమతించాల్సి ఉంటుంది. ఈ నిబంధన మేరకే త్వరలో తేదీ ప్రకటిస్తామని స్పీకర్‌ తెలిపారు. అయితే ఈ సారి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు 18 రోజులు మాత్ర‌మే జ‌రుగుతాయి దీంతో ఏ రోజు స‌భ‌లో మళ్లీ ఈ అంశం చ‌ర్చ‌కు వ‌స్తుందా అని అనుకుంటున్నారు అంద‌రూ.