స్పీక‌ర్ కోడెల త‌న‌యుడి వీరంగం

364

న‌ర‌సారావుపేట‌లో వార్ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది వైసీపీ టీడీపీ మ‌ధ్య ఏ చిన్న‌త‌గాదా అయినా అది రాజకీయంగా పెద్ద చ‌ర్చ‌ల‌కు దారితీస్తోంది.స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామకృష్ణ పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. తమ వర్గీయులను విడిచిపెట్టాలంటూ పోలీసుస్టేషన్‌లో హడావుడి చేశారు. మీకెంత ధైర్యం ఉంటే మా మనిషిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొస్తారంటూ పోలీసులపై దూషణలకు దిగారు. ఇప్పుడు ఇది సెగ్మెంట్లో పెద్ద చ‌ర్చ‌కు దారితీసింది.

Image result for kodela sivaramakrishna

వినాయకుని నిమజ్జనం సందర్భంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై జరిగిన దాడి విషయంలో ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్‌ కొలికొండ కొండలును పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న మండల టీడీపీ నాయకులు మంగళవారం సాయంత్రం స్టేషన్‌కు చేరుకుని తమ నాయకుడిని వెంటనే విడుదల చేయాలంటూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Image result for kodela sivaramakrishna

ఇదే సమయంలో నరసరావుపేట నుంచి స్పీకర్‌ కోడెల తనయుడు శివరామకృష్ణ రొంపిచర్ల పోలీసుస్టేషన్‌కు వస్తూనే పోలీసులపై విరుచుకుపడ్డారు. డీఎస్పీ కె. నాగేశ్వరరావు కూడా అప్పుడే వచ్చారు. శివరామకృష్ణకు డీఎస్పీ మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులపై శివరామకృష్ణ గొడవకు దిగడంతో మండల టీడీపీ నేతలు మరింతగా రెచ్చిపోయి పోలీసులను తిడుతూ దౌర్జన్యం చేశారు. దీంతో అక్కడ తీవ్ర వాగ్వాదం జ‌రిగింది.. ఈ వివాదం అంతా వీడియో తీస్తున్న కానిస్టేబుల్ ని అడ్డుకుని ఆ కెమెరాని లాక్కున్నారు, ఇక ఈ స‌మ‌యంలో అరెస్ట్ చేసిన టీడీపీ నేత‌ని వ‌దిలే వ‌ర‌కూ ఇక్క‌డ నుంచి వెళ్ల‌ను అని భీష్మించుకున్నారు దీంతో రెండు గంటల వివాదాల త‌ర్వాత అక్క‌డ నుంచి శివ‌రామ‌కృష్ణ వెళ్లిపోయారు.