స్పీక‌ర్ కోడెల వ్యాఖ్య‌ల‌పై దుమారం

452

ఏపీలో పోల‌వ‌రం ప్రాజెక్ట్ ఇంత తొంద‌ర‌గా ప‌నులు జ‌రుగుతున్నాయి అంటే దీనికి ప్ర‌ధాన కార‌ణం ఏపీ సీఎం చంద్ర‌బాబు అని అన్నారు స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్. ఇక ముఖ్య‌మంత్రిపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు… తెలుగుదేశం నాయ‌కులు ఆయ‌న‌పై ప్ర‌సంశ‌ల జ‌ల్లు కురిపించినా ప‌ర్వాలేదు కాని, ఇప్పుడు స్పీక‌ర్ శివప్ర‌సాద్ పొగ‌డ్త‌లు కురిపించ‌డం పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.. రాజ్యంగబ‌ద్ద ప‌దవిలో ఉన్న ఆయ‌న, ఇలా ముఖ్య‌మంత్రిపై పొగ‌డ్త‌లు చేయడం ఏమిటి అని అంటున్నారు.

Image result for kodela siva prasad

తెలుగుదేశం నాయ‌కుల చేస్తే అది పార్టీ పొగ‌డ్త‌, కాని ఇటు అధికార ప్ర‌తిప‌క్ష పార్టీలు అన్నింటికి స‌మాన‌మైన ఎటువంటి భేదం లేకుండా చూడాల్సిన స్పీక‌ర్ ఇలా ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రిస్తే ఎలా అని ప్ర‌శ్నిస్తున్నారు. పోల‌వ‌రంలో టూర్ కు వెళ్లిన నాయ‌కులు అంద‌రూ గ్యాలరీ వ్యాక్ కార్య‌క్ర‌మంలో కుటుంబ స‌మేతంగా పాల్గోన్నారు…పోలవరం ప్రాజెక్టు 80 సంవత్సరాల ఆలోచన. దీని కోసం 30 ఏళ్లుగా ప్రయత్నాలు జరిగాయి. మరో ఏడునెలల్లో పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుంది.’ అని కోడెల ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు.

Image result for kodela siva prasad

ఇక మంత్రి నారాలోకేష్ కూడా నాలుగేళ్ల‌లో ఇంత‌టి అభివృద్ది ఇలాంటి ప్రాజెక్టుని త్వ‌రిత గ‌తిన పూర్తిచేయాల‌నే ప‌ట్టుద‌ల, సీఎంకు ఉండ‌టం వ‌ల్లే ఇంత స్పీడుగా ప‌నులు జ‌రుగుతున్నాయి అని అన్నారు. మొత్తానికిఇటు స్పీక‌ర్ వ్యాఖ్య‌లు పార్టీలో ఎలా ఉన్నా, రాష్ట్రంలో విమ‌ర్శ‌కుల నుంచి నెగిటీవ్ టాక్ ని తెచ్చుకున్నాయి…ఇటు ప్ర‌తిప‌క్ష పార్టీ కూడా దీనిని టార్గెట్ చేసింది. ఈవ్యాఖ్య‌లు స‌రైన‌వి కావంటూ పార్టీ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు.