పంచ‌భూతాలే బాబు అవినీతికి సాక్ష్యం – సోము వీర్రాజు

383

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా తెలుగుదేశం అధినేత సీఎం చంద్ర‌బాబు పై ఎలా విమ‌ర్శ‌లు చేస్తారో తెలిసిందే.. ఆయ‌న విమ‌ర్శ‌ల‌కు తెలుగుదేశం నేత‌లు వ‌న్ బై వ‌న్ కామెంట్లు ఖండ‌న‌లు చేస్తూ ఉంటారు.. అయితే తెలుగుదేశం నేతల వెర్ష‌న్ ఎలా ఉన్నా, ఇటు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా నియ‌మితులు అవుతారు అని అంద‌రూ భావించారు.. కాని ఆయ‌న‌కు అమిత్ షా ఆ ప‌ద‌వి ఇవ్వ‌లేదు.. క‌న్నాని కాపుల‌ను బీజేపీకి దగ్గ‌ర‌చేయాలి అనే ఉద్దేశంలో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు ఆ ప‌ద‌వి బాధ్య‌త‌లు అప్ప‌గించారు..

Image result for సోము వీర్రాజు

అయితే ఇప్ప‌టికే ఏపీలో బీజేపీ ప‌రిస్దితి అలాగే ఉంది.. దీంతో బీజేపీ ఎటువంటి పొలిటిక‌ల్ స్టెప్ ఏపీలో ఫాలో అవుదాము అని అనుకున్నా కేడ‌ర్ స‌మ‌స్య తీవ్రంగా ఉంది.. ఇక బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాత్రం బాబు పై విమ‌ర్శ‌ల అస్త్రాలు వ‌దులుతూనే ఉన్నారు… రాష్ట్రంలో దోచుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు అని బాబు బ‌రితెగించి అవినీతి చేస్తున్నారు అని ఆయ‌న విమ‌ర్శించారు.

Image result for సోము వీర్రాజు

ఎయిర్ పోర్టుకు సేక‌రించిన భూముల‌ను ప్రైవేట్ సంస్ద‌ల‌కు ఇస్తున్నారు అని ఆయ‌న విమ‌ర్శించారు.. స్కూలు భ‌వనాల‌కు రంగులు వేయ‌డంలో కూడా అవినీతి చేస్తున్నారు అని ఆయ‌న విమ‌ర్శించారు.. ఇలాంటి అవినీతిని దేవుడు చూస్తున్నాడు మీకు దేవుడే స‌రైన స‌మాధానం చెబుతాడు అని ఆయ‌న విమ‌ర్శించారు.. వీరు చేసే ప‌నుల‌కు ఈ పంచ‌భూతాలే సాక్ష్యాలు అని ఆయ‌న విమ‌ర్శించారు.. చంద్ర‌బాబు జాగ్రత్త‌గా ఉండాలి అని ఆయ‌న హెచ్చ‌రించారు..ఇలాంటి అవినీతి చేస్తున్న చంద్ర‌బాబును వెంట‌నే భ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని గ‌వ‌ర్న‌ర్ దీనిపై ఆలోచించాలి అని ఆయ‌న అన్నారు.