యాక్టీవ్ అయిన శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి

377

వైసీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి రాజ‌కీయంగా మ‌రింత యాక్టీవ్ అయ్యారు.. నంద్యాల ఉప ఎన్నిక‌ల త‌ర్వాత ఆయ‌న కాస్త డైల‌మాలో ప‌డినా, ప్ర‌స‌త్తుం పొలిటిక‌ల్ గా త‌న దూకుడు చూపిస్తున్నారు..రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు.. తాను డ‌బ్బుల‌కు అమ్ముడుబోయే మ‌నిషిని కాదు అని, త‌న ఎమ్మెల్సీ ప‌ద‌విని సైతం వ‌దిలి వైసీపీలో చేరాను అని తెలియ‌చేశారు.

Image result for shilpa chakrapani

మ‌న పార్టీ వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే శ్రీశైలంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్లు కూడా కట్టిస్తామన్నారు. కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయిస్తామని హామీ ఇచ్చారు… దేవస్థానంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల జీతాల పెంపునకు ఈఓతో మాట్లాడానని తెలిపారు..

Image result for shilpa chakrapani

ఇక్క‌డ ఎన్ని స‌మ‌స్య‌లు ఉన్నా ఎమ్మెల్యేకి క‌నిపించ‌డం లేదు అని అన్నారు ఆయ‌న‌…టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రావడానికి ప్రజలను మభ్య పెడుతున్నారని, నిరుద్యోగ భృతి పేరిట మోసం చేస్తున్నారని శిల్పా విమర్శించారు… వైసీపీకి ప్ర‌జ‌ల్లో వ‌స్తున్న ఆద‌ర‌ణ చూసి టీడీపీ ఆశ్చ‌ర్య‌పోతోంద‌ని అన్నారు ఆయ‌న‌… ఇక అధికారంలోకి రావ‌డానికి టీడీపీ ఎన్ని కుయుక్తులు ప‌న్నినా వైసీపీ విజ‌యం వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌థ్యం అన్నారు ఆయ‌న‌.